శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ జోష్..
ముంబై: శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ బుధవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఐరన్ వోర్ (ఇనుప ఖనిజం) మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ కౌంటర్లో జోష్ పెరిగింది. మదుపర్ల కొనుగోళ్లతో శర్దా సుమారు 8 శాతం జంప్చేసింది. నిలిచి పోయిన ఇనుప ధాతువు వెలికితీత పనులు పునరుద్ధించినట్టు కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ తో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు శర్దా వైపు మళ్లారు నక్సలైట్ల దాడి కారణంగా మార్చి 7న నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలు తిరిగి మొదలు పెట్టినట్టు తెలిపింది. అయితే శర్దా లో కార్యకలాపాలు పునఃప్రారంభంతో కౌంటర్లో కొనుగోళ్ల ధోరణి నెలకొందని మార్కెట్ విశ్లేషకుల అంచనా .