iron rods
-
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్‌ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్‌ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..
-
శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..
సాక్షి, చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. ఇనుపరాడ్లతో యువకుడిని దుండగులు దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని ఇమ్రాన్ (27)గా పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమందితో ఇమ్రాన్ గొడవలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిన ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హతమార్చిందెవరనే దానిపై సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు -
ఇనుమును బంగారంగా నమ్మించి
బంజారాహిల్స్: ఇనుప కడ్డీలను బంగారు కడ్డీలుగా నమ్మించి ఓ మేస్త్రిని నిండా ముంచిన ఘటనలో నిందితుడ్ని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ పీడీ నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హర్యానాకు చెందిన మహ్మద్ ఇనాం అలియాస్ అబ్బాస్ ప్రొక్లెయినర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఫిలింనగర్‌లోని బాలాజీ స్టోన్ క్రషింగ్ యజమాని వద్ద ఉంటున్నాడు. ఫిలింనగర్ వినాయకనగర్ బస్తీకి చెందిన వెంకటయ్య స్టోన్ కట్టింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గత మే నెల 29న వెంకటయ్య బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లోని టీవీ9 బస్టాప్ వద్ద రాళ్లు కొట్టే పని ఉండటంతో ఇనాం తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు రోజు ల పాటు ఇనాంతో కలిసి తిరగడంతో అతడితో స్నేహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఇనాం తన గ్రామం నుంచి తన స్నేహితుడు మహ్మద్ హసన్ ఫోన్ చేశాడని, బంగారాన్ని రూ.20వేలకు తులం విక్రయిస్తున్నట్లు చెప్పా డు. దీంతో ఆశ పడిన వెంకటయ్య ఆ బంగారం తానే కొంటానని ఒప్పందం కుదుర్చుకొని ముందుగా రూ.5లక్షలు, ఆ తర్వాత రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం ఇద్దరూ కలిసి హర్యానాలోని ఇనాం గ్రామానికి వెళ్లగా వెంకటయ్య రెండు కడ్డీలను తీసుకున్నాడు. వాటిని తనిఖీ చేయించిన అనంతరం మిగతా డబ్బులు చెల్లిస్తానని చెప్పి వచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన వెంకటయ్య వాటిని బంగారం షాపులో చూపించగా అవి ఇనుప కడ్డీలని చెప్పారు. ఈ విషయం పోలీసులకు చెబితే నిందితుడు పారిపోయే ప్రమాదం ఉందని భావించిన వెంకటయ్య గత జూన్ 25న ఓ వ్యక్తి తనను కిడ్నాప్ చేసి మత్తు చల్లి సికింద్రాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లి రూ.7.50 లక్షలు లాక్కున్నాడని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇనాంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు హసన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
ఐరన్ రాడ్స్‌తో టీడీపీ నేతల దాడి
-
ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
-
ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
► మరో నలుగురికి తీవ్ర గాయాలు ► ట్రెయిలర్ లారీ పైనుంచి పక్కన వెళుతున్న ఆటోపై పడిన రాడ్లు ► మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే ► సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ వద్ద ఘటన సాక్షి, సంగారెడ్డి రూరల్ ఓ ట్రెయిలర్ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. పనికోసం వెళుతూ.. ఇంద్రకరణ్ గ్రామ శివారులో నువోసాల్ అనే సోలార్ కంపెనీ నిర్మాణం జరుగుతోంది. ఆ కంపెనీ షెడ్డు నిర్మాణం కోసం సోమవారం రాత్రి ఓ ట్రెయిలర్ లారీలో పర్లిన్ బండిల్స్ (షెడ్డు పైకప్పు వేసేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు)ను తీసుకువచ్చారు. అయితే అప్పటికే రాత్రి 7.30 దాటిపోవడంతో తాము అన్లోడ్ చేసుకోబోమంటూ కంపెనీ ప్రతినిధులు తిప్పి పంపారు. ఇదే సమయంలో ఆ కంపెనీలోనే క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్న అస్సాం కార్మికులు కొందరు ఓ ఆటోలో పనికోసం వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రెయిలర్ లారీని చూసిన ఆటో డ్రైవర్ కాస్త పక్కగా జరిపి నిలిపాడు. అయితే రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండడంతో.. ట్రెయిలర్ తీవ్రంగా ఊగి పర్లిన్ బండిల్స్ ఆటోపై పడిపోయాయి. దీంతో అందులో ఉన్న సరోజ్‌కుమార్ (28), సూరజ్ కుమార్ భక్తా (23), చుట్టూ భక్తా (18), సుధామ (20) అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్చెరు మండలం క్యాసారానికి చెందిన ఆటోడ్రైవర్ పాండుగౌడ్తో పాటు అస్సోంకు చెందిన మానస్ మజ్జి, రూబెన్, ప్రదీప్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అస్సాం రాష్ట్రంలోని నవగాం జిల్లా ఇటాసలి పంచాయతీ సమితి పరిధిలోని బర్హాపూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.