Irrigation Circle
-
విజయనగరం సరి‘కిల్’
విజయనగరం సాగునీటి సర్కిల్ కార్యాలయం ఏర్పాటులో జిల్లా పాలకులు విఫలమయ్యారు. అక్కడి పాలకుల ఒత్తిడి మేరకు శ్రీకాకుళానికి తాజాగా సర్కిల్ కార్యాలయం మంజూరు చేయగా... ఇక్కడి అధికారపార్టీ నాయకులు చేతకానితనం వల్ల జిల్లాలో జలవనరులశాఖ ఒక కొలిక్కి రాకుండా పోయింది. ఫలితంగా జిల్లాలో ఉన్న బొబ్బిలి సర్కిల్ కార్యాలయం పరిధి కేవలం రెండు డివిజన్లకే పరిమితం కాగా... విజయనగరం డివిజన్ విశాఖపట్నంలో కొనసాగాల్సి వస్తోంది. విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో మైనర్, మీడియం ఇరిగేషన్‌కు ఇంతవరకు రెండు సర్కిల్ కార్యాలయాలు ఉన్నారుు. ఇందులో ఒకటి బొబ్బిలిలో ఉండగా మరొకటి విశాఖపట్నంలో ఉంది. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఐదు ఇరిగేషన్ డివిజన్లు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, జంఝావతి డివిజన్లు ఉన్నాయి. జిల్లాలో ఉన్న విజయనగరం డివిజనుతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అన్ని డివిజన్లు విశాఖపట్నంలో కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ తాజాగా జీవో నంబరు 106 జారీ చేసింది. దాని ప్రకారం బొబ్బిలి సర్కిల్ పరిధిలో ఇంతవరకు ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ఐదు డివిజన్లు ఆ సర్కిల్ కార్యాలయం పరిధిలోకి వెళ్లారుు. పార్వతీపురం మైనర్ ఇరిగేషన్ డివిజన్, జంఝావతి డివిజన్ మాత్రమే బొబ్బిలి సర్కిల్లో మిగిలాయి. మన సంగతేమిటి? శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు వెనుక అక్కడి నేతల తీవ్ర కృషి ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన అక్కడ మంత్రి, ఇతర నాయకులు సర్కిల్ కార్యాలయం సాధిం చుకున్నారు. బొబ్బిలి కార్యాలయంతో సంబంధం లేకుండా చేసుకున్నారు. కానీ అలాంటి ప్రతిపాదనే మన జిల్లా నుంచి కూడా జలవనరులశాఖ కార్యాలయానికి వెళ్లింది. జిల్లా కేంద్రం విజయనగరంలో ఒక సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని జెడ్పీ వేదికగా తిర్మానించి ప్రతిపాదన పంపించారు. కానీ శ్రీకాకుళానికి సర్కిల్ కార్యాలయం మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రభుత్వం మన ప్రతిపాదనను పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి జిల్లాపై చిన్నచూపు చూసిందని స్పష్టమవుతుంది. మంత్రు లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లే రాలేదని చర్చజరుగుతోంది. సర్కిల్ కార్యాలయం ఒక్కటైతే... వాస్తవానికి సర్కిల్ కార్యాలయం ఏర్పా టు కావాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళంలో ఉన్న ఐదు డివిజన్లతో కొత్త గా అక్కడ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుతో బొబ్బిలి రెండింటికి పరిమితం కావడంతో అక్కడ పనిభారం తగ్గినట్లేనంటున్నారు. ఈ నేపధ్యంలో విజయనగరం డివిజన్‌తో కలిపి మూడింటిని ఒక సర్కిల్ పరిధిలోకి తీసుకొచ్చి జిల్లా పరిధిలో కొత్త సర్కిల్ ఏర్పాటు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. దీనివల్ల విజయనగరం వాసులు విశాఖపట్నం సర్కిల్‌కు వెళ్లే శ్రమ తగ్గుతుందని చెబుతున్నారు. బొబ్బిలిలో ఉన్న సర్కిల్ కార్యాలయం విజయనగరంలో ఏర్పాటు చేస్తే రైతులతోపాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటుందంటున్నారు. ఆ దిశగా పాలకులు చొరవ చూపితే బాగుంటుందని ఒక సీనియర్ ఇంజినీరు అభిప్రాయపడ్డారు. -
ఇరిగేషన్ సర్కిల్ రానట్టేనా?
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందాన జిల్లాలో అత్యధిక సాగునీటి వనరులు ఉన్నా.. సకాలంలో సక్రమంగా వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండడం లేదు. జిల్లా కేంద్రంగా నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు 33 ఏళ్లుగా ఫలించడంలేదు. ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ జాప్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి! పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఐదు నీటిపారుదల డివిజన్లు విజయనగరం జిల్లా బొబ్బిలి నీటిపారుదల సర్కిల్ పరిధి నుంచి తొలగిస్తూ జిల్లాకు కొత్త నీటి పారుదల సూపరింటెం డింగ్ ఇంజినీరు (ఎస్ఈ)కార్యాలయం (సర్కిల్ కార్యాలయం) ఏర్పాటు చేసే విషయమై జిల్లా ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ అధికారులు చేస్తున్న విజ్ఞప్తులు ఫలించడంలేదు. అనేకసార్లు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చారే తప్ప ఆచరణ దిశగా ఒక్కడుగూ వేయడంలేదు. 33 ఏళ్లుగా ఇదే తీరు. ఇదే విషయాన్ని హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లా పరిశీలనకు వచ్చిన రాష్ర్ట నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వద్ద ఇరిగేషన్ శాఖాధికారులు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడుతో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు విన్నవించా రు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఆయన హామీఇచ్చా రు. రాష్ట్రం మొత్తం మీద కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే ఈ సమస్య వేధించడం, దీనిని పరిష్కరించే దిశగా హామీలిచ్చిన మంత్రు లు సైతం మిన్నకుండ డంతో జిల్లాకు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా..! శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్‌శాఖకు సంబంధించి ఐదు డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇవి ఇరిగేషన్ డివిజ న్ శ్రీకాకుళం, ఎస్ఈ డివిజన్ శ్రీకాకుళం, ప్రత్యేక నిర్మాణ విభాగం మడ్డువలస, ఎస్ఎంఐ డివిజన్ సీతంపేట, తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు(టీబీపీ-2) రాజాం డివిజన్‌గా సేవలందిస్తున్నారు. ఈ ఐదు డివిజన్ల పరిధి నుంచి జిల్లా వ్యాప్తంగా 2,92,250లక్షల ఎకరాల్లో సాగునీరు అందించేందుకు ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. నాగావళి నదీ పరీవాహక పరిధిలో తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 39,544 ఎకరాలు, మరో ప్రధాన ప్రాజెక్టు నారాణయపురం ద్వారా 76,597 ఎకరాలు సాగవుతోంది. మైనర్ ఇరిగేషన్ స్కీం ద్వారా మరో 11,988 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇన్ని ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఎండమావిగానే మిగిలింది. దీనంతటికీ కార ణం ఉన్నతస్థాయి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసేందుకు అవసరమైన సర్కిల్కార్యాలయం ఈ ప్రాంతంలో లేకపోవడమేనని రైతు సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అధికం శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి వనరులకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు 60శాతం పైబడి వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్నారు. 1983 నుంచి జిల్లాలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వాలు 33 ఏళ్లుగా సాగదీస్తూ వస్తున్నారు. దీంతో విజయనగరం జిల్లా బొబ్బిలి వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఇటు అధికారులకు, రైతులకు దాపురించింది. సర్కిల్ కార్యాలయంతో జిల్లాకు మరింత మేలు జిల్లాలో అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో అధికంగా పనులు జరుగుతున్నా యి. కానీ సర్వీస్ పనులు, ఫైళ్ల క్లియరెన్సు.. ఇలా ప్రతి చిన్న, పెద్ద పనులకు మాత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పనులు మరింత వేగవంతం చేయాలంటే జిల్లాలో సర్కిల్ కార్యాలయం తప్పని సరి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారిస్తే ఫలితం ఉంటుంది. -బి.అప్పలనాయుడు,ఎస్ఈ, వంశధార -
నేటి నుంచి గలగలా గోదారి
తూర్పు, మధ్య డెల్టాలకు నేడు నీటి విడుదల ధవళేశ్వరం : సుమారు రెండు నెలల అనంతరం గోదారమ్మ పంట కాలువల్లోకి పరుగులు తీయనుంది. తూర్పు,సెంట్రల్ డెల్టాలకు ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు. 58 రోజుల విరామం అనంతరం తూర్పు డెల్టాకు, 55 రోజుల విరామం అనంతరం సెంట్రల్ డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు మధ్య డెల్టాకు, 10.30 గంటలకు తూర్పు డెల్టాకు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ సుగుణాకరరావు లాంఛనంగా నీటిని విడుదల చేస్తారని హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేయాలి. అయితే రబీ పంట ఆలస్యం కావడంతో ఏప్రిల్ 17 వరకు తూర్పు డె ల్టాకు, ఏప్రిల్ 20 వరకు మధ్య డెల్టాకు నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. దాంతో కాలువలకు షార్ట్ క్లోజర్ పనులను మాత్రమే చేయడానికి వీలైంది. ఆ పనుల కోసమే ఇంతవరకు నీటిని విడుదల చేయలేకపోయారు. తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు రూ. 50 కోట్ల మేరకు పనులను పూర్తి చేసినట్టు ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు శనివారం తెలిపారు. సహజ జలాలే ఆధారం కాలువలకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వర్షాలు ఇంకా పడకపోవడంతో గోదావరి సహజ జలాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రోజుకు సుమారు 3,500 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్‌కు చేరుతుంది. వానలు పడేంతవరకు ఈ నీరే శరణ్యం. ప్రాజెక్టులవారీ క్యాడ్ కమిటీలు వేయాలి రామచంద్రపురం : రాష్ట్ర స్థాయి క్యాడ్ కమిటీ ద్వారా ఎటువంటి పనులూ జరగడం లేదని, ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి చిన్న పనికీ రాష్ట్రస్థాయి క్యాడ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. రైతులకు అనువుగా ఉండేలా ప్రాజెక్ట్‌లవారీ క్యాడ్ కమిటీలను వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల రైతుల సమస్యలను సకాలంలో గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే పనులు చేపట్టడానికి వీలవుతుందన్నారు. నీటితీరువా నిధులు ఇప్పుడా! నీటితీరువా నిధులు ఇప్పుడు విడుదల చేశారని, కాలువలకు నీళ్లు ఇచ్చే సమయంలో ఈ నిధులు విడుదల చేయడంవల్ల ప్రయోజనమేమిటని త్రినాథరెడ్డి ప్రశ్నించారు. ఈ ఏడాది తూర్పు డెల్టాలో ఎ-కేటగిరీ పనులకు రూ.2.85 కోట్లు, బి-కేటగిరీ పనులకు రూ.3.02 కోట్లు నీటి తీరువా నిధులు విడుదలయ్యాయన్నారు. మధ్య డెల్టాలో ఎ-కేటగిరీకి రూ.38 లక్షలు, బి-కేటగిరీకి రూ.3.93 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలువల్లో తూడు తీత పనులు చేపట్టక పోవడంవల్ల వర్షాకాలంలో పంటలు ముంపు బారిన పడే అవకాశం ఉందని అన్నారు.