యువత చేతిలో దేశ భవిత
విజయవాడ కల్చరల్ : భారతీయ యువత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాజమండ్రి ఇస్కాన్ మందిర అధ్యక్షుడు, సౌత్ ఇండియా డివిజన్ కౌన్సిల్ చైర్మన్ సత్యగోపీనాథ్ ప్రభూజీ పేర్కొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో స్వరాజ్యమైదానంలో జరుగుతున్న స్వర్ణోత్సవం శుక్రవారం రెండోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ యువత సక్రమమైన బాటలో నడవడానికి భగవద్గీత మంచి సాధనమన్నారు. నూతన రా«జధాని అమరావతిలో ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు కేంద్రంగా రూ.100 కోట్లతో శ్రీకృష్ణ స్వర్ణదేవాలయం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి దేవాలయ అధ్యక్షుడు సుకదేవ స్వామి మహరాజ్, బెంగళూరు మందిర అధ్యక్షుడు వరదకృష్ణదాస్, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన స్వామీజీలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బరంపురానికి చెందిన ప్రిన్స్ గ్రూప్ సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రారంభ కార్యక్రమంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించే అంశంతో ప్రారంభమైంది. ‘లిటిల్ కృష్ణ’ అంశంలో బాలకృష్ణుడి కాళీయ మర్దనం, శ్రీకృష్ణ రాసలీలు,« దశావతారాల అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. చివరిగా ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల జీవితం, ఆయన సమాజసేవ, శ్రీకృష్ణతత్వాన్ని ప్రచారం తదితర అంశాలు ప్రదర్శించారు.
నేటి కార్యక్రమాలు
శనివారం సాయంత్రం 7 గంటలకు సత్యగోపీనాథ్ స్వామి ప్రవచనాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భగవద్గీత పోటీల విజేతలకు బహుమతి ప్రదాన్సోవ సభ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.