మాజీ సీఎంపై కేటీఆర్ ఫైర్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు ఒక బోగస్ ఐఎస్ఐఎస్ సైట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
దానిపైనే కేటీఆర్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి అత్యంత బాధ్యతారహితమైన, గర్హనీయమైన వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేదా అందుకు తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలని దిగ్విజయ్ సింగ్ ట్వీట్‌కు సమాధానంగా ఇచ్చిన మరో ట్వీట్లో కేటీఆర్ అన్నారు. దిగ్విజయ్ తన ట్వీట్లలో పేర్కొన్న అంశాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఖండించారు. బాధ్యతాయుతమైన సీనియర్ నాయకుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం వల్ల దేశవిద్రోహ శక్తులతో పోరాడుతున్న పోలీసుల నైతిక స్థైర్యం, వారి పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని అనురాగ్ శర్మ అన్నారు.
Telangana Police has set up a bogus ISIS site which is radicalising Muslim Youths and encouraging them to become ISIS Modules.
— digvijaya singh (@digvijaya_28) 1 May 2017
Most irresponsible & reprehensible thing coming from a former CM. Request you to withdraw these comments unconditionally or provide evidence https://t.co/cg7p7Ym48X
— KTR (@KTRTRS) 1 May 2017
Unfounded allegations from a senior responsible leader will lower the morale and image of Police engaged in fighting anti-national forces https://t.co/vzR8dfVldc
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) 1 May 2017