ఎక్కడ కనిపించినా ఆ 70 మందిని చంపేయండి!
'వారు ఎక్కడున్నా వెతికి మరీ చంపేయండి. వాళ్ల ఇంటికి వెళ్లి తలనరకండి. కత్తితో పొడవండి, లేదా నేరుగా తుపాకీతో కాల్చేయండి. అదీ కుదరకపోతే బాంబుపెట్టి లేపేయండి'.. ఇది తన మద్దతుదారులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూక ఇచ్చిన సందేశం. సిరియాలో తమ ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులు జరిపిన 70 మంది అమెరికా సైనిక సిబ్బంది లక్ష్యంగా ఐసిస్ హ్యాకర్లు ఈ ప్రకటన చేశారు. 70మంది అమెరికా సైనికులతో కూడిన ఓ హిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు.
బ్రిటన్‌తో సంబంధాలు ఉన్న 'ఇస్లామిక్ స్టేట్ హ్యాకింగ్ డివిజన్'కు చెందిన హ్యాకర్లు ఈ హిట్ లిస్ట్‌ను తయారుచేశారు. ఇందులో అమెరికా సైనికుల పేర్లు, వారి ఇంటి చిరునామాలు, వారి ఫొటోలు ఉన్నాయి. ఐఎస్ఐఎస్ జెండాతో 'లక్ష్యం అమెరికా సైన్యమే' అనే పేరిట ఈ హిట్‌లిస్ట్‌ను ఐసిస్ హ్యాకర్లు ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు. బ్రిటన్ రక్షణ శాఖలోనూ తమకు రహస్య వేగులు ఉన్నారని, సిరియాలో డ్రోన్ దాడులకు పాల్పడిన బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేటర్ల జాబితాను కూడా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సహాయంతో త్వరలోనే ప్రకటిస్తామని ఐసిస్ హ్యాకర్లు హెచ్చరించారు.