isis threatens owaisi
-
అసదుద్దీన్‌కు ఐఎస్ బెదిరింపులు
-
అసదుద్దీన్‌కు ఐఎస్ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: ‘‘నీవు భారతదేశ ముస్లింలను అవమానిస్తున్నావు. ఇస్లామిక్ రాజ్యాన్ని వ్యతిరేకించే నీకు నరకమే ప్రాప్తిస్తుంది. ప్రజాస్వామ వ్యవస్థ ముస్లింలకు వ్యతిరేకం. దానిని అమలు చేయకుండా నిషేధించాలి.. లేదా అంతం చేయాలి. షరియా ప్రకారం ముస్లింలందరూ ఒక్కటే. ముస్లింలు మీలాగా జాతీయవాదులు కారు. మీలాంటి వ్యక్తులే ముస్లింలను విభజించి చూస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా నోరు మెదపడం మానుకోవాలి’’ ఇదీ ట్విట్టర్లో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి వచ్చిన హెచ్చరిక. ఐఎస్ సానుభూతిపరుడు అబోతాలోత్ ట్విట్టర్ ఖాతా నుంచి అసదుద్దీన్‌కు ఈ బెదిరింపు వచ్చింది. దీనికి అసదుద్దీన్ తీవ్రంగానే స్పందించారు. ‘‘మీరు ముస్లిం వ్యతిరేకులు. రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్‌పై చర్చకు సిద్ధం. నేను లేవనెత్తిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు’’ అంటూ రీట్వీట్ చేశారు. ఐఎస్ ఓ దెయ్యం సైన్యం: అసద్ ఐఎస్ఐఎస్ దెయ్యం సైన్యమని అసదుద్దీన్ అభివర్ణించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐఎస్ ట్విట్టర్ బెదిరింపులపై ఆయన స్పందించారు. స్వర్గం, నరకం దేవుడి చేతిలో ఉంటాయని, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఐఎస్‌కు ఇస్లాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్కాలర్స్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసి, వారి కార్యకలాపాలను ఖండించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐఎస్ ఉగ్రవాదులు సుమారు 1.5 లక్షల మందిని హతమార్చారని, వారి ఆలోచనావిధానం మారాలని చెప్పారు. ఎక్కడో ఎలుక మాదిరిగా దాక్కొని బెదిరించడం సరికాదని సూచించారు. భారతదేశంవైపు కన్నెస్తే సహించేది లేదని ఐఎస్‌ను హెచ్చరించారు. రాజకీయపరంగా విభేదాలున్నా.. దేశం కోసం అందరూ ఏకమై సరైన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇక్కడి ముస్లింలు కరడుగట్టిన భారతీయులని, మాతృదేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారని చెప్పారు. -
ఒవైసీకి ఐఎస్ఐఎస్ హెచ్చరికలు
-
ఒవైసీకి ఐఎస్ఐఎస్ హెచ్చరికలు
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఐఎస్ఐఎస్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐఎస్ఐఎస్ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్లో బెదిరింపు వచ్చింది. త్వరలోనే భారతదేశంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. అయితే.. ఏదో ఒకరోజు అందరూ చనిపోవాల్సిందేనని, కొందరు ఒకరోజు ముందు, మరికొందరు ఒకరోజు తర్వాత పోతారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను రేపిస్టులు, హంతకులుగా అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. యువకులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని ఇటీవల పలు బహిరంగ సభలలోనూ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. దీంతో ఐఎస్ఐఎస్ ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ తాజా బెదిరింపులపై అసదుద్దీన్ స్పందించారు. ఐఎస్ఐఎస్ ఇస్లాం మతానికి వ్యతిరేకమని, ఆ ఉగ్రవాద గ్రూపు ఎన్ని బెదిరింపులు చేసినా తాను భయపడబోనని ఆయన స్పష్టం చేశారు. ''ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే. కొందరు ముందు పోతే, మరికొందరు వెనక పోతారు. నేను మాత్రం ఐఎస్ఐఎస్ అంటే భయపడేది లేదు. ఐఎస్ఐఎస్ వల్ల లక్షన్నర మంది ముస్లింలు చనిపోయారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాల వల్లే అది పుట్టింది. ప్రపంచంలో ఉన్న స్కాలర్లందరూ దాన్ని ఖండించారు, నేనూ ఖండించాను. ఇస్లాంకు, ఐఎస్ఐఎస్కు సంబంధం లేదు. సోషల్ మీడియాలో మాత్రమే అలా ప్రచారం జరుగుతోంది. ఐఎస్ఐఎస్ ఒక ఉగ్రవాద సంస్థ. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా'' అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. @abotalout sir you are a bloody Takfiri if you want to debate on Evil ISIS I am ready you will not be able to counter my Theological Points — Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016 @abotalout you can dream so keep dreaming Takfiri read @Shaykhabulhuda book on ISIS will bring y out of Darkness of ISIS Allah give Taufeeq — Asaduddin Owaisi (@asadowaisi) January 6, 2016