Islamabad Pakistan
-
నా డ్యూటీ ముగిసింది!..ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత పైలెట్ ఝలక్
విమానాలను వాతావరణ పరిస్థితుల రీత్యా లేక సాంకేతిక లోపం కారణంగానో ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి హోటల్ వసతి కూడా ఏర్పాటు చేయడమో లేక మరో విమానంలో పంపించడమో జరుగుతుంది. అయితే ఇక్కడోక పైలెట్ మాత్రం అత్యవసర ల్యాండిగ్ తర్వాత తన డ్యూటీ ముగిసిందంటూ ...విమానాన్ని కొనసాగించాడానికి నిరాకరించాడు. అసలు విషయంలోకెళ్తే...రియాద్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత పైలెట్ తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి విమానాన్ని కొనసాగించడానికి నిరాకరించాడు. అంతే ప్రయాణికులు ఆగ్రహంతో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దమ్మామ్ విమానాశ్రయ భద్రతాధికారులను రంగంలోకి దిగింది. ఈ మేరకు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరేవరకు హోటల్లోనే వసతి కల్పించారు. అయితే విమాన భద్రత దృష్ట్యా పైలెట్ విశ్రాంతి తీసుకోవాలని, పైగా ప్రయాణికులందరూ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకునేంతవరకు వారికి హోటళ్లలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మీడియాకి తెలిపారు. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
Imran Khan: కశ్మీర్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే..
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ‘జమ్మూకశ్మీర్ ఐక్యరాజ్యసమితి ఎజెండాలో ఉంది. దీనిపై భద్రతా మండలి పలు తీర్మానాలు కూడా చేసింది. అందుకే కశ్మీర్ భారత్ అంతర్గత అంశం కాదు’అని ఆయన మీడియాకు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం 2019లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. (చదవండి: చైనా జనాభాలో స్వల్ప పెరుగుదల) -
పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి
ఇస్లామాబాద్: అక్రమంగా పాక్ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది. జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ మాలిర్ సల్మాన్ అంజిద్ సిద్ధిఖీ ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేశారు. భారత జాలర్లు ఇప్పటికే 8 నెలల జైలు శిక్ష అనుభవించారని, వారు చేసిన నేరానికి ఆ శిక్ష సరిపోతుందన్నారు. వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ఇరుదేశాలకు చెందిన జాలర్లు పొరపాటున పొరుగుదేశ జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్ కావడం గత కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. అరేబియా సముద్రంలో ఏ దేశానికి ఎంతమేరకు జలసరిహద్దు ఉందో కచ్చితమైన సమాచారం లేకపోవడంతోనే వందల సంఖ్యలో జాలర్లు ఇలా పొరుగు దేశంలో జైలు పాలు కావాల్సి వస్తుందని పాక్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.