Istanbul Blast
-
ఇస్తాంబుల్ బాంబ్ బ్లాస్ట్: అనుమానితుడి అరెస్ట్
అంకారా: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధృవీకరించారు. #URGENT Person who left bomb that caused explosion Sunday on Istanbul’s Istiklal Avenue arrested by police, says Interior Minister Suleyman Soylu pic.twitter.com/I08OTC4rPb — ANADOLU AGENCY (@anadoluagency) November 14, 2022 మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారాయన. ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 ఇదీ చదవండి: ఇస్తాంబుల్ పేలుడు.. చెవులు పగిలిపోయేలా సౌండ్ -
షాపింగ్ స్ట్రీట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 53 మందికి గాయాలు
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని ఇస్తిక్లాల్ షాపింగ్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్ఏడీ బృందాలు సంఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మార్కెట్ ప్రవేశ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ‘ఘటనాస్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు-నలుగురు పడిపోయి కనిపించారు. భయంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్ష సాక్షి, 57 ఏళ్ల కెమాల్ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్లాల్ షాపింగ్ వీధిలో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 విద్రోహ చర్య.. ఖండించిన ప్రెసిడెంట్.. రద్దీగా ఉండే ప్రాంతంలో సామాన్యులే లక్ష్యంగా చేసిన దాడిని ఖండించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగాన్. ఇది ఉగ్రవాదులు చేసిన విద్రోహ చర్యేనని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు సంబంధిత విభాగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. Police cordon off the scene of the explosion in #Istanbul. pic.twitter.com/m0XtxNNa9T — NEXTA (@nexta_tv) November 13, 2022 ఇదీ చదవండి: ‘పులిని చూసిన మేకల్లా పారిపోయారు’.. రష్యా సేనలపై ఉక్రెయిన్ పౌరుల సెటైర్లు -
ఆ ఆత్మాహుతి దాడి.. ఐఎస్ఐఎస్ పనే!
ఇస్తాంబుల్: ప్రపంచంలోని ప్రఖ్యాత పర్యాటక నగరమైన టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గూపేనని భావిస్తున్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతమైన ఇస్లాంబుల్‌లోని సుల్తానామెట్‌లో సిరియాకు చెందిన సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో విదేశీ పర్యాటకులు సహా పది మంది చనిపోయారని టర్కీ అధ్యక్షుడు తయిపీ ఎర్డోగాన్ తెలిపారు. సుల్తానామెట్‌లోని బ్లూ మసీదు, హజియా సోఫియా వద్ద విదేశీ పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్‌యేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక నగరాల్లో ఒకటి.. ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే యూరప్ నగరమైన ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి దాడితో భీతావహ పరిస్థితి నెలకొంది. పేలుడు జరిగిన సుల్తానామెట్ స్వ్కేర్ వద్ద మృతిచెందిన వారి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిఉండి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ఘటనలో మృతిచెందిన, గాయపడిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉండటంతో పలు దేశాలు ఇప్పటికే అక్కడికి వెళ్లిన తమ దేశ పౌరులపై ఆరా తీస్తున్నాయి. జర్మనీ, నార్వే దేశాలు ఇస్తాంబుల్‌లోని తమ పర్యాటకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాయి.