శ్రీవల్లి రష్మిక జోడికే డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీవల్లి రష్మిక జోడి విజేతగా నిలిచింది. మారిషస్లో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక (భారత్)- కేటీ లాఫ్రాన్స (అమెరికా) జోడి 3-6, 6-4, 10-6తో అమిలియా - జరా లినెన్ జంటపై విజయం సాధించింది. తుదిపోరులో తొలిసెట్లో తడబడిన రష్మిక జోడి తర్వాత రెండు సెట్లలో విజయం సాధించి టైటిల్ను దక్కించుకుంది.