అధికారులు వేధింపులపై ఉద్యోగులు ధర్నా
అనంతపురం : అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం అనంతపురంలో ఆందోళనకు దిగారు. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేసే సుమారు 100 మంది ఉద్యోగులు జిల్లా సైన్స్ సెంటర్ ఎదుట ధర్నా చేశారు.