itukalapalli
-
సాక్షి విలేకరిపై దాడి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ దైర్జన్యానికి దిగారు. భూవివాదంలో హైకోర్టు స్టేకాపీ ఇచ్చేందుకు వెళ్లి సాక్షి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. స్టేకాపీ ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రాప్తాడు విలేకరి కొండన్నపై దుర్భాషణలాడారు. గతంలో కూడా సీఐ రాజేంద్రనాథ్‌పై అనేక ఆరోపణలు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కందుకూరు వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మంత్రి పరిటాల సునీత అండతో సీఐ రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా రాజేంద్రనాథ్‌పై ఉండడం గమనార్హం. -
యువకుడి దారుణహత్య
ఎస్కేయూ : ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర దాబా వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎస్ఐ అబ్దుల్ కరీం కథనం ప్రకారం.. 35 సంవత్సరాల వయసు కలిగిన యువకుడి మెడకు వైరుతో గొంతుకు బిగించి చంపేశారు. ఆ తర్వాత గుర్తుపట్టకుండా ఉండేందుకు అతడి ముఖంపై డీజిల్ పోసి నిప్పుపెట్టారు. హతుడు కుడిచేతిపై రత్న, ఎడమ చేతిపై చిరంజీవి అనే పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. సోమవారం హత్యాస్థలిని సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. హతుడి వివరాలు తెలిసిన వారు సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ 9440796807 లేదా తన 9491414360 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ అబ్దుల్ కరీం సూచించారు. -
టీడీపీ నేత బెదిరింపులతో...
అనంతపురం సెంట్రల్ : రూరల్ మండల పరిధిలోని ఇటుకలపల్లికి చెందిన చౌడప్ప (40) శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. చౌడప్పకు గ్రామ సమీపంలో వాల్మీకి విగ్రహం వద్ద గత కాంగ్రెస్ హయాంలో ఇంటి స్థలం మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీకి చెందిన చోటా నేత ఒకరు బెదిరించడంతో మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో బాధితుడిని సర్వజనాస్పత్రికి తరలించారు.