j srinivasulu
-
ప్రాణాపాయ స్థితిలో గాయకుడు జై శ్రీనివాస్
సాక్షి, ఆదిలాబాద్: చిన్నప్పటి నుంచీ పాటే ప్రాణంగా పెరిగాడు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. దేశభక్తి పాటతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కరోనా బారిన పడడంతో రూ.11లక్షలకు పైగా వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఆర్థిక పరిస్థితి ఛిన్నాబిన్నం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. మందమర్రి మూడో జోన్‌కు చెందిన నేరడికొమ్మ శ్రీనివాస్ ఉరఫ్ జై శ్రీనివాస్ స్థానిక సింగరేణి హైస్కూల్లో 1993లో పదో తరగతి వరకు చదివాడు. ఆయన తండ్రి మందమర్రి ఏరియాలోని స్టోర్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తించి 15ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. అక్క చైతన్య, బావ జితేంద్ర సహకారంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్న మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అవకాశాలు లభించడంతో పలు చిత్రాల్లో పాడాడు. జై సినిమాలోని దేశభక్తి పాట ‘దేశం మనదే తేజం మనదే..’, రాజారాణి సినిమాలో ‘ఓ బేబి ఓరకనులతో..’, వీధి సినిమాలో ‘నా చిట్టితల్లి..’, బోనాల పాట ఢమ ఢమ డప్పుల మోత, తెలంగాణ జననీ తదితర అనే పాటలతో గుర్తింపు పొందాడు. నేరడికొమ్మ శ్రీనివాస్ తన పాటతో ‘జై శ్రీనివాస్’గా మారాడు. సినిమా, దేశభక్తి, జానపద, దైవభక్తి పాటలు పాడి పేరు సంపాదించుకున్నాడు. కరోనాతో ఆసుపత్రిలో.. జై శ్రీనివాస్ గత నెలలో కరోనా బారిన పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటివరకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.11లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో భార్యాపిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీనివాస్ తండ్రి రామాచారి బ్యాంకు అకౌంట్ నంబరు 62107990766, ఐఎఫ్‌సీ కోడ్ N0020308, గూగుల్‌పే నంబర్ 918247641235కు దాతలు ఆర్థికసాయం అందించాలని భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర కోరుతున్నారు. చదవండి: ఆర్ఎంపీల అత్యుత్సాహం.. టైపాయిడ్ పేరిట వైద్యం -
జెస్సీ మృతికి ఏపీ సీఎం సంతాపం
విజయవాడ: సాక్షి స్పోర్ట్సు జర్నలిస్టు జె. శ్రీనివాసులు హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా క్రీడారంగంలో పాత్రికేయుడిగా సేవలందిస్తున్న ఆయన ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నారని కొనియాడారు. ఆయన మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. -
సాక్షి టీవీ జర్నలిస్టు ‘జెస్సీ’ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సాక్షి టీవీ స్పెషల్ కరస్పాండెంట్ జె.శ్రీనివాసులు (55) తీవ్ర గుండెపోటుతో ఆదివారం తెల్ల వారుజామున మృతి చెందారు. మూడు దశా బ్దాలుగా క్రీడా పాత్రికేయునిగా తెలుగు మీడియాలో ప్రత్యే క గుర్తింపు దక్కించుకున్న శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దాదాపు 30 ఏళ్ల క్రితం ఉదయం దినపత్రికలో క్రీSడా పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత వార్త దినపత్రిక స్పోర్ట్స్ ఎడిటర్‌గా చేశారు. 2008 నుంచి సాక్షి టెలివిజన్ చానల్లో పని చేస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆయన ప్రత్యక్షంగా కవర్ చేశారు. రేడియో, టీవీ వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. సన్నిహి తులు ఆత్మీయంగా ‘జెస్సీ’ అని పిలుచుకునే ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. సీఎం కేసీఆర్, వైఎస్ జగన్,వైఎస్ భారతి దిగ్భ్రాంతి జెస్సీ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. సీఎం తరఫున ఆయన పీఆర్వో జి.విజయకుమార్ జెస్సీ మృతదేహంపై పుష్పగుచ్ఛముంచి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి జెస్సీ హఠాన్మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జెస్సీ కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పాత్రికేయలోకానికి తీరని లోటని భారతి అన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ తదితరులు జెస్సీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. క్రీడా మంత్రి పద్మారావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డితో పాటు పలు క్రీడా సంఘాలు జెస్సీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాయి