డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఎంఐఎం నేత
హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున నగరంలోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంఐఎం నేత పట్టుబడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జావీద్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జావీద్ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.