తృటిలో జబల్పూర్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు డీకొని చిన్నారుల మరణించిన ఘోర సంఘటన కళ్ల ముందు మెదులుతుండగానే.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదమే తప్పింది.
కాపాలేని రైల్వే క్రాసింగ్ వద్ద జబల్పూర్ ఎక్స్ప్రెస్ జేసీబీని డీకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున గల కర్ణాటకలోని దొడ్డబళాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.