అమెరికాలో కేటీఆర్కు ఘనస్వాగతం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ సాధనకోసం అమెరికా వదిలిపెట్టి వచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి ఆ గడ్డపై అడుగుపెట్టడంతో ఐటీ మంత్రి కె. తారకరామారావుకు ఘనస్వాగతం లభించింది. ఆయన బుధవారం ఉదయం అట్లాంటాలోని జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి అమెరికాలోని ప్రవాస టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పుష్పగుచ్చాలు ఇచ్చి సాధరంగా ఆహ్వనించారు.
ఆయన గురువారం ఉదయం వాషింగ్టన్ డీసీలో పర్యటించనున్నారు. అక్కడ భారత రాయబారి అర్జున్ సింగ్తో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొని.. విందుకు హజరవుతారు. సుమారు పదేళ్ల తర్వాత అమెరికా వచ్చానని, రెండువారాల పాటు పలు సమావేశాల్లో బిజీగా గడపనున్నానని మంత్రి ఈ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.