త్వరలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
మహబూబ్నగర్ : డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.రాజయ్య మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జడ్చర్ల ఏరియా ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రతి రోగి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులను మందుల కోసం బయటకు పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జర్నలిస్టులకు త్వరలోనే హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాజయ్య తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు.