బెల్లం అల్లమే!
కామారెడ్డి: బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. విశాఖ జిల్లా అనకాపల్లి తరువాతి స్థానంలో కామారెడ్డి ప్రాంతం నిలిచేది. అప్పట్లో ఏటా కామారెడ్డి డివిజన్లో 60 వేల ఎకరాల నుంచి 70 వేల ఎకరాల వరకు చెరకు పంట సాగయ్యేది. వందలాది లారీలలో బెల్లం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు తరలిపోయేది. చెరకు పంట నరికివేతకు ముందే రైతులు క్రషర్లను, పొయ్యిలను రెడీ చేసుకునేవారు.
ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి, పగలు తేడా లే కుండా రైతులు క్రషర్ల వద్ద పనుల్లో నిమగ్నమయ్యేవారు. బెల్లం తయారు చేసిన రైతులే గాక బెల్లం వ్యాపారులు కూ డా ఎన్నో లాభాలు ఆర్జించేవారు. ఇ దంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరకు సాగు నుంచి మొదలుకొంటే బెల్లం త యారీదాకా అన్ని రకాల పెట్టుబడు లు భారీగా పెరిగాయి. దానికనుగు ణంగా ధరలు పెరుగకపోవడంతో రై తులు బెల్లం తయారీపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కరెంటు, కూలీల కొరత వంటి సమస్యలతో రైతులు బెల్లం తయారీకి దూరమయ్యారు. ఏటా దీపావళి వరకు బెల్లం ముద్దలు మార్కెట్కు చేరేవి. ఈసారి ఇప్పటిదాకా ఒక్క ముద్ద కూడా మార్కెట్కు వచ్చిన దాఖలాలు లేవు.
ఏం జరిగిందంటే
కామారెడ్డి ప్రాంతంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వచ్చిన తరువాత బెల్లం తయారీకన్నా చెరకును ఫ్యాక్టరీకి పంపడానికే రైతులు ఆసక్తి చూపారు. అయితే ఫ్యాక్టరీలో సమయానికి పర్మిట్లు దొరక్క, కూలీల కొరతలు ఏర్పడడం వంటి కారణాలతో రైతులు బెల్లం తయారుకు మొగ్గుచూపినా, మార్కెట్లో బెల్లానికి సరైన ధరలు లభించడం లేదు.
కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నల్లబెల్లంపై 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావంతో బెల్లం ధరలు పడిపోయి తయారీకి బ్రేకులు పడ్డాయి. ఆంక్షలపై బెల్లం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. 2001లో భిక్కనూరులో బెల్లం రైతుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చి పోలీసు లాఠీ చార్జి చేయడంతో, కోపోద్రిక్తులైన రైతులు పోలీసు వాహనాలను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 40 మంది వరకు రైతులను జైలుకు పంపించారు.
వైఎస్ఆర్ వచ్చాక ఆంక్షల ఎత్తివేత
2004లో డాక్టర్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత బెల్లంపై ఆంక్షలను ఎత్తివేశారు. మళ్లీ గత రెండుమూడేళ్ల నుంచి బెల్లంపై అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు బె ల్లం లారీలను సీజ్ చేసిన సంఘటనలతో బెల్లం ధర లు పడిపోయాయి. ఇటీవల కూడా బెల్లం లారీలను పట్టుకోవడంతో వ్యాపారులు, రైతులు సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు.
ఆంక్షలు లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులలో వ్యాపారులు కూడా ధైర్యం చేయడం లేదు. ఇదే సమయంలో పగ లు, రాత్రీ తేడా లేకుండా కష్టపడి ఇబ్బందులపాల య్యేకన్నా బెల్లం తయారీకి దూరం కావడమే నయమన్నట్టు రైతులు చెరకును ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి డివిజన్లో 20 వేల ఎకరాలకు మించి చెరకు పంట సాగు కావడం లేదు.
భారీగా పెరిగిన ఖర్చు
ఏడాది పంటైన చెరకు సాగుకు అయ్యే ఖర్చులతో పాటు బెల్లం తయారీలోనూ ఖర్చులు భారీగా పెరి గాయి. చెరకు పంట సాగుకు ఎకరానికి రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చవుతుంది. బెల్లం తయారీకి ఎకరాకు రూ. 25వేల వరకు ఖర్చవుతుం ది. మొత్తంగా ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బెల్లం క్వింటాలుకు రూ. 2,550 ధర పలుకుతోంది. ఎకరాకు 250 ముద్దల బెల్లం తయారవుతుంది. ఒక్కో ముద్ద తయారీకి రూ. వంద ఖర్చ వుతుంది. బెల్లం 35 క్వింటాళ్ల వరకు అవుతోంది.
అమ్మడం ద్వారా రూ.90 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు రూ. 80 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కష్టపడితే ఎకరాకు రూ. 10 వేలకు మించి మిగలడం లేదు. ఒకవేళ ఆంక్షల ప్రభావంతో ధర పడిపోతే అసలుకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆదాయం, ఖర్చులను లెక్కలేసుకుంటున్న రైతులు బెల్లం తయారీ కన్నా చెరకును ఫ్యాక్టరీకి తరలించడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో టన్నుకు రూ. 2,600 ఇస్తున్నారు. చెరకు నరకడం, రవాణా ఖర్చులకు టన్నుకు రూ. 600 పోయినా రూ. 2 వేలు మిగులుతుంది.
ఎకరాకు 30 టన్నుల నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తే రూ. 80 వేలు వస్తుంది. అందులో నరకడం, రవాణా ఖర్చులు, పెట్టుబడులవి మొత్తంగా కలిపితే రూ. 60 వేల పెట్టుబడి అవుతుంది. తద్వారా ఎకరాకు ఎలాం టి రిస్కు లేకుండా రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. అదే బెల్లం తయారీ చేస్తే మిగులు ఏమోగాని నష్టా లు తప్పవని, అందుకే బెల్లం తయారీకి దూరమయ్యామని రైతులు అంటున్నారు. చెరకు పంట సాగు చేసే రైతులకు ప్రభుత ్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బెల్లం తయారీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధర కల్పించినపుడు రైతులు కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.