‘గెలిచేది తెలంగాణ వాదమే’
చల్లంపల్లి(తలకొండపల్లి), న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణవాదమే గెలుస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని చల్లంపల్లిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. ఇతర పార్టీల నాయకులు డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురి చేసినా ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఫలితంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. టీఆర్ఎ స్ హయూంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుం దని చెప్పారు.
10 జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విభజిం చి, సంక్షేమాభివృద్ధి పథకాలను అమలుపరుస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిం చి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసి రైతంగాన్ని ఆదుకుం టామన్నారు. బ్యాక్‌లాక్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల కు ఉపాధి కల్పిస్తామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహ్మ, మాజీ ఎంపీపీ పర్వతాలుయాదవ్, రమేశ్, భిక్షపతి, బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు.