‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం
నటుడు జూనియర్ ఎన్టీఆర్పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి దుష్ప్రచారనికి తెగబడ్డాయా?. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు విడుదలైన సందర్భంలో చేసినట్లుగానే తాజాగా 'జై లవ కుశ' చిత్రం విషయంలోనూ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయా సోషల్మీడియా వేదికల్లో ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారం ఆ విషయాన్నే నిర్థారిస్తోంది.
నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) నటించిన ఈ చిత్రం గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు చోట్ల సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, సినిమా బాగా లేదని, జై లవ కుశ కంటే.. పైసా వసూలే బెటర్ అంటూ తెలుగు దేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో సందేశాలు పంపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాలపై దుష్ప్రచారం జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ తారక్ చిత్రాల విడుదల అనంతరం బాగా లేదనే నెగిటివ్ ప్రచారాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా కొన్ని టీడీపీ శ్రేణులు వాట్సప్ ద్వారా జైలవకుశ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ‘బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టిన జై లవకుశ. కథలో కొత్తదనం లేకపోవటం, కథనాన్ని రక్తి కట్టించలేకపోవటం లోపాలుగా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు. జై లవకుశ కన్నా పైసా వసూల్ చిత్రం బెటర్ అంటున్న ప్రేక్షకులు’ అంటూ వాట్సప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది.