jail for life
-
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు
ఇంటర్నెట్ డేటింగ్ సైట్లో తాను కలిసిన ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసి, మరో ఇద్దరిపై దాడికి పాల్పడిన సీరియల్ రేపిస్టుకు జీవిత ఖైదు పడింది. హాంప్షైర్లోని లిప్హూక్ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్ (55) రెండు వేర్వేరు రకాల ప్రొఫైల్స్ సృష్టించుకుని, ఐదు ప్రాంతాలకు చెందిన మహిళలను ఆకర్షించి, వారిపై అత్యాచారం చేశాడు. ఆ నేరం రుజువు కావడంతో అతడికి జీవితఖైదు విధించారు. పెరోల్ రావాలన్నా కనీసం 12 సంవత్సరాల ఆరు నెలల పాటు అతడు జైల్లో ఉండాల్సి వస్తుంది. అతడు మహిళల పాలిట రాక్షసుడని, అత్యంత ప్రమాదకారి అని జడ్జి గ్రెగరీ డికిన్సన్ అన్నారు. మ్యాచ్.కామ్ అనే డేటింగ్ సైట్లోనే తన భార్యను కూడా కలిసిన లారెన్స్, ఆమెను పెళ్లాడిన కొన్ని నెలలకే ఈ దాడులు చేశాడు. 2011 జూన్ నుంచి 2014 నవంబర్ వరకు డెర్బీషైర్, లింకన్షైర్, నార్తాంప్టన్షైర్, కేంబ్రిడ్జిషైర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి.