Jailed for life
-
ఉక్రెయిన్ కోర్టు తొలిసారి కీలక తీర్పు.. యుద్ధ నేరానికి పాల్పడిన రష్యా సైనికుడికి..
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. గత 12 వారాల్లో రష్యా దళాలు ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించాయి. యుద్ధం ఫలితంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోంది. అయితే యుద్ధంలో ఇంత వరకు ఫలితం ఎటూ తేలలేదు. అయితే ఒక్క మరియూపోల్ నగరపై మాత్రం రష్యా ఆధిపత్యం సాధించింది. ఇక శత్రు బలగాలను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా రష్యాపై దాడులు కూడా చేస్తోంది ఉక్రెయిన్. కాగా తమ దేశంపై దండెత్తిన రష్యా సేనలపై ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాల కింద విచారణ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశ పౌరుడిని కాల్చి చంపినందుకు ఉక్రెయిన్ కోర్టు రష్యా సైనికుడికి జీవితఖైదు విధించింది. నిరాయుధుడైన 62 ఏళ్ల ఉక్రెయిన్ పౌరుడిని కాల్చి చంపి యుద్ధ నేరానికి పాల్పడినందుకు 21 ఏళ్ల ట్యాంక్ కమాండర్ వాదిమ్ షిషిమారిన్కు జీవిత కారాగార శిక్ష విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌లోని చుపాఖివ్కా గ్రామంలో వృద్ధుడిని రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు కారులో నుంచి కాల్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇదిలా ఉండగా రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్ కోర్టు ఒక రష్యా సైనికుడికి ఇలా శిక్ష వేయడం తొలిసారి. చదవండి: ‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
అంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు
బ్యాంకాక్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో గత ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి పలు అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
మైనర్లను రేప్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్ విజేత సింగ్ రావత్ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు. ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. -
‘బ్రహ్మజ్ఞాని’ రేప్ చేయటం పాపం కాదట!
జోధ్‌పూర్: బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని రేప్చేయడం పాపం కాదని ఆసారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్ కె.సచార్ జోధ్‌పూర్ కోర్టుకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఓ బాలికను రేప్‌చేసిన కేసులో ఆసారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడటం తెల్సిందే. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్ సచార్ చెప్పిన విషయాలను వెల్లడించింది. పుష్కర్(రాజస్తాన్), భివానీ (హర్యానా), అహ్మదాబాద్ (గుజరాత్)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్ చెప్పాడు. ‘ఆశ్రమంలో ఆసారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు. వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు. ఈ ముగ్గురు బాలికలే ఆసారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు. అహ్మదాబాద్‌లో బాబా ఓ బాలికను వేధిస్తుంటే ప్రత్యక్షంగా చూశా. బాబాను నిలదీశా. బ్రహ్మజ్ఞాని అలాంటివి చేయటం పాపం కాదని ఆసారాం బదులిచ్చాడు. ప్రశ్నించినందుకు నన్ను బయటకు గెంటించాడు. లైంగిక సామర్థ్యం పెంపు కోసం నల్లమందుతోపాటు ఇతర మందులను వాడే వాడు’ అని సచార్ తెలిపారు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాకా దాడికి పాల్పడ్డారన్నారు. -
భార్య హత్య కేసులో యావజ్జీవం
♦ నిందితుడు గుంటూరులో వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగి ♦ నిందితుడి తండ్రి జడ్జి కావడంతో కేసు ఒంగోలుకు బదిలీ ఒంగోలు సెంట్రల్: కిరోసిన్ పోసి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.45 వేల జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.వి.విజయకుమార్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. చీరాలకు చెందిన లలిత ను 1995 సంవత్సరంలో గుంటూరుకు చెందిన ధర్మవరపు వెంకటరమణ వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో పది సంవర్ల బంగారం, రూ.70 వేల నగదును కట్నం కింద వధువు తరుపు వారు రమణకు ఇచ్చారు. రమణ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండటంతో అప్పట్లో చిలకలూరిపేటలో కాపురం పెట్టారు. అనంతరం పిడుగురాళ్లకు బదిలీ కావడంతో అక్కడకు మకాం మార్చాడు. వైవాహిక జీవితంలో వీరికి ఒక పాప పుట్టింది. చెడు వ్యసనాలకు లోనైన రమణ, కనీసం ఇంటి ఖర్చులకు కుడా నగదు ఇవ్వకుండా లలితను వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2009 మే 23న లలిత పేరున చీరాలలో ఉన్న స్థలాన్ని అమ్మి తన అప్పులు తీర్చాలని లలితను వేధించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమె జననాంగంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 90 శాతంకు పైగా కాలిన గాయూలతో ఉన్న లలితను ఎక్కడా చికిత్స అందించకుండా, ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికివ తరలిస్తూ కాలం గడిపాడు. ముందుగా పిడుగురాళ్ల వైద్యశాలకు అక్కడి నుంచి మంగళగిరి ఎన్ఆర్ఐకి, అక్కడి నుంచి సమీపంలోని మణిపాల్‌కు ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్‌కి చికిత్స నిమిత్తం అంటూ తిప్పాడు. మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత జీజీహెచ్లోపలికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి వైద్యాధికారులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. మృతురాలి సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితుడి తండ్రి జడ్జి కావడం, ఆయన గుంటూరులో కూడా పని చేసి ఉండటంతో పాటు గుంటూరు జిల్లా స్థానికులు కావడంతో కేసును ప్రకాశం జిల్లాకు బదిలీ చేయాలని బాధితులు కోరారు. నిందితుడు తెలివిగా మృతురాలి మరణ వాంగ్మూలం కూడా నమోదు కాకుండా మరణించే వరకూ అంబులెన్సులో తిప్పిన్నట్లు మృతురాలి సోదరులు వాపోయారు. వారి వినతి మేరకు కేసు ప్రకాశం జిల్లాకు బదిలీ అయింది. జిల్లా కోర్టులో నేరం నిరూపణ కావడంతో జడ్జి కె.వి.విజయకుమార్ పై శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శివరామకృష్ణ ప్రసాద్ తన వాదనలను వినిపించారు.