విద్యార్థి అదృశ్యం
కదిరి టౌన్ : నల్లచెరువులో అమ్మజాన్, అల్లాబకష్ దంపతుల కుమారుడు జైనుల్లా(7) అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడన్నారు. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఇంటి ఆవరణలో గడచిన సోమవారం ఆడుకుంటూ బాలుడు అదృశ్యమయ్యాడండూ తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. అప్పటి నుంచి గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తమకు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.