jaipur event
-
స్వామీజీ మహిళలను చూడగానే..!
జైపూర్: ఓ కార్యక్రమానికి హాజరైన స్వామిజీ మహిళా ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని ఉండడం చూసి, సభలో ప్రసంగించకుండానే వెనుదిరిగిన ఘటన జైపూర్లో చోటు చేసుకొంది. జైపూర్ బిర్లా ఆడిటోరియంలో జూన్ 30న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గురువు స్వామి జ్ఞానవాత్సల్య, తన ప్రసంగాన్ని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. తాను ప్రసంగించే ఆడిటోరియంలోని మొదటి మూడు వరుసలలో మహిళలను కూర్చోనివ్వడానికి అనుమతించకూడదని స్వామి జ్ఞానవాత్సల్య ముందుగానే సభ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తాను షరతు పెట్టినా కూడా నిర్వాహకులు మహిళలను ముందు వరుసలో కూర్చొనిచ్చిన కారణంగా.. స్వామిజీ ఈ కార్యక్రమం నుంచి వైదొలిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 'రాజ్ మెడికాన్ 2019' అనే ఈ కార్యక్రమాన్ని 'ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ అసోసియేషన్ (అరిస్డా)' నిర్వహించింది. మహిళా వైద్యులు స్వామి జ్ఞానవాత్సల్య విధించిన షరతులపై కొందరు మహిళా డాక్టర్లు కలత చెందగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్వామిజీ ప్రసంగాన్ని అడ్డుకుంటామని నిరసన తెలిపారు. అయితే వైద్యులు, నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, మొదటి రెండు వరుసలను ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. కానీ, స్వామిజీ వేదిక వద్దకు రాగానే.. కొందరు మహిళలు ముందు వరుసలో వచ్చి కూర్చొన్నారు. ఈ సంఘటన గూర్చి డాక్టర్ రితు చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ ప్రసంగం వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చాలా మంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చున్నారు. హఠాత్తుగా మొదటి మూడు వరుసల్లో మహిళలు కూర్చొరాదని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు. -
తాప్సీ నో చెప్పింది!
పింక్ సినిమా గత సెప్టెంబర్ నెలలో విడుదలైన తర్వాతి నుంచి హీరోయిన్ తాప్సీ వరుసపెట్టి వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు బాగా వచ్చాయి. ఆ తర్వాత ఆమెను అవార్డు ఫంక్షన్లకు, వివిధ కార్యక్రమాలకు ఎక్కువగానే పిలుస్తున్నారు. వాటిలో ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడుతోంది. అయితే.. తాజాగా రాజస్థాన్లోని జైపూర్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాప్సీ నో చెప్పిందట. ఎందుకని ఆరా తీస్తే.. ఆ కార్యక్రమాన్ని ఓ ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిసింది. తమ క్రీములు వాడితే మహిళలు తెల్లగా అవుతారంటూ ప్రచారం చేయడం పట్ల పలువురు హీరోయిన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. జైపూర్ సదస్సులో కూడా మహిళా సాధికారత సమస్యల గురించే ప్రధానంగా చర్చించారు. కానీ అలాంటి కార్యక్రమానికి ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేయడాన్ని తాప్సీ అంగీకరించలేకపోయింది. దాంతో ఆమె ఆ కార్యక్రమానికి వచ్చేది లేదని స్పష్టం చేసింది. అలా క్రీములు రాసుకుంటే తెల్లగా అయిపోతారన్న విషయాన్ని తాను నమ్మబోనని, అందుకే రాలేనని చెబుతూ అందుకు సారీ కూడా చెప్పింది. చిట్టచివరి విషయంలో తాను విరమించుకున్న విషయం నిజమేనని, కానీ ఫెయిర్నెస్ క్రీమ్ వాళ్ల స్పాన్సర్ షిప్ కూడా అప్పుడే తెలిసిందని ఆమె చెప్పింది. నిజానికి తాను తెల్లగా ఉండటం వల్ల కొన్ని సినిమా చాన్సులు కూడా కోల్పోయానని అందువల్ల వాటిని తాను ప్రమోట్ చేయబోనని కుండ బద్దలుకొట్టింది.