Jakarta airport
-
బ్రేకింగ్: ఇండోనేషియా విమానం గల్లంతు
జకార్తా: ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కలిపి మొత్తం 59 మంది ఉన్నట్లు తెలుస్తోంది.ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపుతోంది. అయితే ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆ దేశానికి చెందిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండోనేషియా దేశంలో విమానయాలకు విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి. -
టేకాఫ్ అవుతున్న సమయంలో..
జకర్తా: టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఢీ కొన్న ఘటన ఇండోనేషియా రాజధాని జకర్తాలో చోటు చేసుకుంది. వెంటనే చర్యల చేపట్టిన ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని విమాన సర్వీసులను తాత్కలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని సంభవించలేదు. ప్రధాన ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకల రద్దీని అదుపు చేసేందుకు దగ్గరలోని మిలటరీ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారు. బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం 49 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో టేకాఫ్ అవుతుండగా, అదే సమయంలో ట్రాన్స్నూసకు చెందిన ఎయిర్‌క్రాప్ట్ విమానం కూడా బయల్దేరడంతో రెండు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బతిక్ ఎయిర్‌కు చెందిన విమానం రెక్క తీవ్రంగా దెబ్బతింది.