బెంగాల్ జాతీయపార్కులో ఖడ్గమృగాలు మృతి
వాయవ్య బెంగాల్లోని జల్దపురా జాతీయ పార్కులో ఇటీవలే ౩ ఖడ్గమృగాలు మృతిచెందాయని అటవీ శాఖ అధికారి ఆదివారం తెలిపారు. ఒక్క కొమ్ము ఉండే ఖడ్గమృగాలకు అస్సాంలోని కజరంగ జాతీయ పార్కు తర్వాత జల్దపురా పార్కు ప్రసిద్ధి చెందింది. ఈ నెల 22, 23 తేదీలలో మూడు ఖడ్గమృగాలు చనిపోయాయి. వాటిది సహజ మరణమేనని పశ్చిమబెంగాల్ రాష్ట్ర వన్యమృగ సంరక్షణ ముఖ్యఅధికారి ఉజ్వల్ భట్టాచార్య తెలిపారు. మూడు ఖడ్గమృగాల మృతికి గల కారణాలను శనివారం కనుగొన్నామని ఉజ్వల్ చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జాతీయపార్కులో సంరక్షణలో ఉన్న వన్యమృగాలు మృతి చెందడం బాధాకరం.