మే 3న జమాతే చీఫ్ మరణ శిక్షపై తేలుస్తారు!
ఢాకా: జమాతే ఇస్లామీ చీఫ్ మోతుర్ రహ్మాన్ నిజామి మరణశిక్షపై మే 3న తుది నిర్ణయం వెలువడనుంది. ఈ మేరకు వేసిన పిటిషన్‌పై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు విచారణను మే 3కు వాయిదా వేసింది. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటం సమయంలో దేశ ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో జమాతే ఇస్లామి చీఫ్ మోతుర్ రహ్మాన్‌కు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించింది.
అయితే, తనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో నిజామి గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరించబడింది.