breaking news
Jamie Overton
-
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు చోటు
సౌతాఫ్రికాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.ఈ క్రమంలో మూడో వన్డేకు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంగ్లండ్ క్రికెట్ శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్ తమ తుది జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. పేసర్ సాకిబ్ మహమూద్ స్దానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు. ఓవర్టన్ ఇటీవలే రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమైన బెన్ డకెట్‌ను మూడో వన్డేకు కొనసాగించారు. అయితే డకెట్‌కు ప్రోటీస్‌తో టీ20ల నుంచి మాత్రం సెలక్టర్లు తప్పించారు. గత కొంతకాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతుండడంతో అతడికి విశ్రాంతి ఇచ్చారు. కాగా తొలి వన్డేలో సఫారీల చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన ఇంగ్లండ్.. అనంతరం రెండో వన్డేలో పోరాడి ఓడింది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2027కు నేరుగా ఆర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కు తదుపరి వన్డే మ్యాచ్‌లు చాలా కీలకంగా మారనున్నాయి.మూడో వన్డేకు ఇంగ్లండ్ తుది జట్టుజేమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
ఇంగ్లండ్ స్టార్ కీలక నిర్ణయం.. ఇకపై..
లండన్: ఇంగ్లండ్ పేసర్ జేమీ ఓవర్టన్ (Jamie Overton) సంప్రదాయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని... అందుకే టెస్టులకు నిరవధిక విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఐదు రోజుల ఆటకు ఇది రిటైర్మెంట్ కాదు. 31 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెటర్ ఇటీవల భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. 2–2తో సమమైన ఆ సిరీస్‌లో అతను రెండు టెస్టులు ఆడాడు.నాకిది ఇబ్బందికరం‘కెరీర్ జోరుగా సాగిపోతున్న ఈ దశలో ఏడాదిలో 12 నెలలు అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండాలంటే కుదరదు. అలా ప్రతీ ఫార్మాట్‌కు న్యాయం చేయలేను. శారీరకంగా, మానసికంగానూ నాకిది ఇబ్బందికరం. అందుకే బాగా ఆలోచించాకే టెస్టులకు విరామం ప్రకటిస్తున్నాను. అప్పుడు నేను పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టొచ్చు. సుదీర్ఘకాలం పాటు వన్డేలు, టీ20లు ఆడేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని ఓవర్టన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యంకాగా 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లోప ప్రయాణం మొదలుపెట్టిన ఓవర్టన్.. ఇప్పటివరకు ఓవర్టన్ కేవలం 6 వన్డేలు, 12 టీ20లే ఆడాడు. ఐపీఎల్లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక లండన్‌లో ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు ఆడాడు. ఓవర్టన్ అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర