Jammu Kashmir election
-
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్క అవకాశం ఇవ్వండి!
* కశ్మీర్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా: మోదీ * బీజేపీకి మెజారిటీ ఇవ్వండి; రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తా * సాంబ, శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ శ్రీనగర్: ‘ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసేందుకు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండి. మీ బాధను, ఆవేదనను పంచుకుంటాను. మీ సమస్యలను, కలలను నావిగా భావిస్తాను. మొత్తం నా ప్రభుత్వాన్ని మీ సేవలో నిలుపుతాను. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్తశిఖరాలకు చేరుస్తాను’ అని ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్ ప్రజలను అభ్యర్థించారు. జమ్మూ ప్రాంతంలోని సాంబాలో, కశ్మీర్‌లోయలోని శ్రీనగర్‌లో ఆయన సోమవారం ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని ‘షేర్ ఇ కశ్మీర్’ క్రికెట్ స్టేడియంలో భారీగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి అరగంట పాటు ప్రసంగించారు. కశ్మీర్‌లోయలో మోదీ తొలి ఎన్నికలసభ ఇదే. సభలో కశ్మీర్ సంప్రదాయ వస్త్రధారణలో మోదీ ఆకట్టుకున్నారు. ఇన్సానియత్.. కశ్మీరియత్.. జమ్హూరియత్ 2003లో ఇదే వేదికపై నుంచి మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత ఏబీ వాజపేయి చేసిన ప్రఖ్యాత వ్యాఖ్య ‘ఇన్సానియత్(మానవత్వం), కశ్మీరియత్(కశ్మీరీతత్వం), జమ్హూరియత్(ప్రజాస్వామ్యం)’ను మోదీ గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఈ మూడు మూల స్తంభాలంటూ.. వాజపేయి ప్రారంభించిన ఈ భావనను ముందుకుతీసుకెళ్తానని, కశ్మీర్‌కు సంబంధించి ఆయన కలలను నిజం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కశ్మీరీలు తనపై ఎంతో విశ్వాసం, ప్రేమ చూపారని, అభివృద్ధి రూపంలో వాటిని వడ్డీతో సహా తీర్చుకుంటానన్నారు. పర్యాటక, విద్యారంగాలను అభివృద్ధి చేస్తామని, ఇక్కడి జలవనరులతో విద్యుదుత్పాదన చేస్తామని హామీ ఇచ్చారు. దాల్ సరస్సు పర్యాటకులతో నిండి ఉండగా చూడాలని ఉందన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు, ఇక్కడినుంచి తరలివెళ్లిన శరణార్థులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వ జాతీయ బాధ్యత అని స్పష్టం చేశారు. వారి పాలనలో రాష్ట్రం సర్వనాశనం రాష్ట్ర ప్రజల కోసం కాకుండా.. సొంత కుటుంబ అభివృద్ధే పరమావధిగా రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్, పీడీపీలపై మోదీ విరుచుకుపడ్డారు. అవి అధికారం కోసం చేతులు కలిపి, ఎన్నికల్లో విమర్శలు చేసుకుంటాయని, ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు అంతం పలకాలని కోరారు. కాంగ్రెస్‌ను ఒక్కస్థానంలోనూ గెలిపించవద్దన్నారు. ఉగ్రవాదం అంతమైన ఈ రాష్ట్రంలో అవినీతి అంతానికి తమతో చేతులు కలపాలన్నారు. ఓటేసే చూపుడు వేలే శక్తిమంతమైంది అంతకుముందు సాంబా సభలో మాట్లాడుతూ.. ఏకే 47 రైఫిల్ ట్రిగర్‌ను నొక్కే చూపుడు వేలు కన్నా.. ఈవీఎం యంత్రాలపై ఓటేసే వేలు మరింత శక్తిమంతమైందన్నారు. ‘ట్రిగర్పై వేలు ప్రాణాలు తీస్తుంది. ఈవీఎంలపై వేలు దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది’ అన్నారు. ఒకప్పుడు తప్పుదారి పట్టిన రాష్ట్ర యువత ఇప్పుడు తుపాకులకు బదులు ‘ఆండ్రాయిడ్ 1’మొబైల్ ఫోన్లను కోరుకుంటున్నారన్నారు. మొదటి, రెండో దశల ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్‌తో.. బుల్లెట్‌పై విజయం సాధించారంటూ రాష్ట్ర ప్రజలను అభినందించారు. ఆ త్యాగం వృథా కాకూడదు నాలుగు రోజుల క్రితం యూరి పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది భద్రతాసిబ్బందికి మోదీ నివాళులర్పిస్తూ.. వారి త్యాగం, వారి సాహసం వ్యర్థం కావడానికి వీల్లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ రక్షణలో సరిహద్దులో 33 వేలమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ‘ఇటీవలి వరదల్లో ప్రజలను రక్షించే క్రమంలో కొందరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో దేశ రక్షణ విధుల్లో ఉన్న వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.. కొందరు అమాయక పౌరులూ చనిపోయారు. వారందరి కుటుంబాలకు ఇది తీరని నష్టం. పంచుకోవడం ద్వారానే ఆ బాధను తగ్గించగలం’ అన్నారు. అలాగే, ‘బుద్గాంలో ఇద్దరు అమాయక యువకులను కాల్చి చంపిన సైనికులపై చర్యలు తీసుకున్నాం. గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా ఈ ధైర్యం చేసిందా?’ అని ప్రశ్నించారు. వారిని కాల్చడం పొరపాటేనని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆర్మీ తన తప్పును ఒప్పుకుందని గుర్తు చేశారు. ‘మీ ప్రధాన సేవకుడిగా మీ బాధ నా బాధ కూడా.. మీ విషాదం, మీ ఆవేదన నాది కూడా’ అని కశ్మీరీలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. అంతకుముందు బాదామీబాగ్ ఆర్మీ కార్యలయం వద్ద యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యూరి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. మోదీ తన ప్రసంగాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచర్చే 370 అధికరణను ప్రస్తావించలేదు. -
'బీజేపీతోనే కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం'
జమ్మూ: జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి జరగకపోవడానికి నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ పార్టీలే కారణమని బీజేపీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శించారు. రాష్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మల్ సింగ్ కు మద్దతుగా బిలావర్ లో సోమవారం సిద్ధూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కశ్మీర్ అభివృద్ధిలో నూతన శకం ప్రారంభం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లను ఆయన కోరారు.