20 నుంచి ‘జన్‌జాగరణ్’
న్యూఢిల్లీ: కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీనుంచి కాంగ్రెస్ పార్టీ జన్‌జాగరణ్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టనుం ది. ఈ కార్యక్రమం నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో మొదలవుతుందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (డీపీసీసీ) అర్విందర్‌సింగ్ లవ్లీ వెల్లడించారు. పార్టీ కార్యాయంలో సహచర నాయకులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలో ఉన్న 49 రోజుల కాలంలో పాలన సజావుగా సాగేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహకరించలేదంటూ ఆప్ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అవాస్తవమని లవ్లీ పేర్కొన్నారు.
ఈ 49 రోజుల వ్యవధిలో ఏ ఒక్కరోజు కూడా కేజ్రీవాల్గానీ, ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులుగానీ ఏ విషయంలోనూ తమతో సంప్రదింపులు జరపలేదన్నారు. కనీసం టెలిఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. అందువల్ల తాము సహకరించలేదనేది ఓ సాకు మాత్రమేనని, అది వారి గందరగోళత్వాన్ని, అసమర్థతను రుజువు చేసిందన్నారు. మరో నాయకుడు హరుణ్ యూసఫ్ మాట్లాడుతూ తమ పార్టీపై ప్రజలు తిరగబడేవిధంగాచేసేందుకు కేజ్రీవాల్ సరికొత్త నాటకమాడుతున్నారని ఆయన ఆరోపించారు.