పొన్నాల..రావేల..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జనగామ నియోజకవర్గంలోని 41 పల్లెలు ఐదేళ్లుగా పొన్నాల లక్ష్మయ్య రాక కోసం నిరీక్షిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికై... మంత్రి పదవి చేపట్టడంతో తమ గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించినట్లేనని భావించిన గ్రామస్తుల ఆశలు అడియూసలే అయ్యూరుు.
2009 ఎన్నికల తర్వాత ఆయన తన నియోజకవర్గ పరిధిలోని మూడో వంతు గ్రామాలకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఈ క్రమంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌గా నిలుస్తాయని చెప్పవచ్చు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామంలోకి రాకపోవడంతో ఆయూ ఊళ్లలోని ప్రజలు ఈ సాధారణ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఇదే అంశం జనగామ అసెంబ్లీ ఫలితాలను నిర్ణయించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనగామ సెగ్మెంట్లో మొత్తం 102 గ్రామాలు ఉన్నాయి. పొన్నాల 2004 ఎన్నికల్లో గెలిచి ఓ దఫా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల అనంతరం రెండో దఫా మంత్రి పదవి చేపట్టారు. ఈ ఐదేళ్లలో ఆయన జనగామ నియోజకవర్గ పరిధిలోని 41 గ్రామాల్లో ఒక్కసారి కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు.
ఐదేళ్లలో ఇన్ని గ్రామాలకు వెళ్లని కాంగ్రెస్ నేత పొన్నాల ఒక్కరే ఉంటారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. దీన్నిబట్టి ఆ ఊళ్లన్నీ అభివృద్ధికి నోచుకోలేదనే విషయం స్పష్టమవుతోందని పొన్నాలపై అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అరుుతే.. 2009 తర్వాత ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు మారాయని... ఈ కారణంతోనే పొన్నాల పర్యటించలేకపోయారని... అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఆగిపోలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
పొన్నాల వ్యతిరేకులు, సన్నిహితుల అభిప్రాయాలు ఎలా ఉన్నా... ఈ 41 గ్రామాల ఓటర్ల స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనగామ నియోజకవర్గంలో మొత్తం 2,04,139 ఓటర్లు ఉన్నారు. పొన్నాల ఒక్కసారి కూడా వెళ్లని గ్రామాల్లో 55,057 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో వీరి నిర్ణయం జనగామలోని రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనుంది.
ఆ గ్రామాలు ఇవే...
జనగామ నియోజకవర్గానికి సంబంధించి అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 2009 నుంచి పొన్నాల లక్ష్మయ్య సందర్శించని గ్రామాలు... మండలాల వారీగా ఇలా ఉన్నాయి.
జనగామ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అడవికేశవాపూర్, సిద్ధెంకి, ఎల్లంల, పెద్దరాంచెర్ల, ఎర్రగొల్లపాడ్, వడ్లకొండ, ఓబుల్ కేశవాపూర్, వెంకిర్యాల, పెద్దపాడ్, గానుగుపాడ్, ప సరమడ్ల, మరిగడి గ్రామాలను పొన్నాల ఐదేళ్లలో ఎప్పుడూ సందర్శించలేదు.
చేర్యాల మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. వీరన్నపేట, చుంచునకోట, క డవేరుగులో ఆయన అడుగుపెట్టలేదు. మరిముచ్చాల గ్రామంలో అమర జవాను చంద్రారెడ్డికి రహదారిపైనే నివాళులర్పిం చి వెళ్లిపోయారు. గ్రామంలోకి రాలేదు. తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్ ప్రారంభానికి వచ్చినా... గ్రామంలోకి అడుగుపెట్టలేదు.
మద్దూరు మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. మరుమాముల, సలాక్పూర్, ధర్మారం, నర్సాయపల్లి, వంగపెల్లి, వల్లంపట్ల, బైరాన్‌పల్లి, కొండాపూర్, జాలపల్లి గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవు.
బచ్చన్నపేట మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కట్కూరు, బం డనాగారం, గంగాపురం, నక్కవానిగూడెం, ఇటుకాలపల్లి, మాన్సాన్పల్లి, నాగి రెడ్డిపల్లిలో పొన్నాల అడుగుపెట్టలేదు.
నర్మెట మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కన్నెబోయిన గూడెం, బొత్తలపర్రె, పోతారం, సోలిపురం, గండిరామారం, మలక్‌పేట్, నర్సాపూర్ గ్రామాల్లో పొన్నాల ఇప్పటివరకు పర్యటించలేదు. బొమ్మకూరులో రిజర్వాయర్ ప్రారంభానికి వచ్చినా గ్రామంలోకి వెళ్లలేదు.