janagama district jac
-
వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
జనగామ అర్బన్ : వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్ఓ కార్యాలయం ఎదుట తెలంగాణ వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు ఎస్టీఓ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈనెల 8వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ము ట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్ట్ ఎం పీహెచ్ఏ (ఎం) అధ్యక్షుడు పేర్వారం ప్రభాకర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కేథరిన్, ఉమెన్ అసోసియేషన్ నాయకులు పూర్ణకుమారి, ఏరియా ఆస్పత్రి అధ్యక్షుడు లక్ష్మయ్య, సెక్రటరీ ప్రవీణ్, సహాదేవ్, సంపత్, శ్రీరాములు, పాండరి, మనోహర్ పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, ఆర్, రాజు, బి. గోపి, ప్రకాష్, ఇర్రి ఆహల్య సంఘీభావం ప్రకటించారు. -
20న జనగామలో జనగర్జన
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న పట్టణంలో జనగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్–పూలే అధ్యయన కేంద్రంలో శనివారం జరిగిన అత్యవసరసమావేశంలో వరంగల్ జేఏసీ కన్వీనర్ జయాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో కలిసి దశమంతరెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా ఆకాంక్షను సీఎం కేసీఆర్‌కు తెలిసేలా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 12న పట్టణం, మండలాలు, గ్రామాల్లో జనగామ జిల్లా చైతన్య యాత్రలు, 14న మానవ హారా లు, 16న జనగామ నుంచి పది మండలాలను కలిపేలా 500 ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో మండల కేంద్రాలు, గ్రామాల్లోని నాయకులు ప్రజల నుంచి జిల్లా అభిప్రాయాలను సేకరించి, బైక్ ర్యాలీగా వచ్చే ప్రతినిధులకు అప్పగించాలని సూచిం చారు. 20నజరిగే జనగర్జన బహిరంగ సభ ను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రచారంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బైక్‌ర్యాలీ రాత్రి నెల్లుట్లలో ముగుస్తుందన్నారు. జనగామ జిల్లాకు వరంగల్ ప్రజలు అండగా ఉంటారని జయాకర్ హామీ ఇచ్చారన్నారు. మంగళ్లపల్లి రాజు, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, మేడ శ్రీనివాస్, శ్రీనివాస్, వేణు, సతీష్, రాజు, ఉపేందర్‌రెడ్డి, మాజీద్, పిట్టల సురేష్, కొండ కిరణ్, శ్రీను తదితరులు ఉన్నారు.