janaki ramaiah
-
ప్లాన్
పట్టుకోండి చూద్దాం జానకిరామయ్య కోటీశ్వరుడు. ఆయన ఒక్కగానొక్క కూతురు శృతి. కూతురిని పూలల్లో పెట్టి చూసుకుంటాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శృతి పెళ్లీడుకొచ్చిన తరువాత... జానకిరామయ్యలో అభద్రతలాంటిదేదో బయలుదేరింది. ‘శృతి అత్తవారింటికి వెళితే నా పరిస్థితి ఏమిటి? ఈ లంకంతా కొంప ఎంత బోసి పోతుంది!’ ఇలా ఏవేవో ఆలోచిస్తూ తనలో తాను బాధ పడుతుండేవాడు. ‘‘రోజు రోజుకూ మీరు చాదస్తంగా తయారవుతున్నారు. ఆడపిల్ల అన్నాక ఏదో ఒకరోజు అత్తావారింటికి వెళ్లాల్సిందే కదా. ఎందుకు ప్రాక్టికల్‌గా ఆలోచించరు?’’ అని జానకిరామయ్యను మందలించింది భార్య అన్నపూర్ణ. నిజానికి జానకిరామయ్య సున్నిత మనస్కుడేమీ కాదు. వ్యాపారంలో ఎన్నో ఆటు పోట్లు తట్టుకొని రాటు తేలాడు. ‘ఇతని హృదయం ఏ స్పందన లేని రాయి’ అని జానకిరామయ్యను ఉద్దేశించి చాలామంది అనేవాళ్లు. అలాంటి జానకిరామయ్య కాస్త... కూతురు పుట్టాక మారిపోయాడు. బంధాలలోని తీయదనానికి అలవాటు పడ్డాడు. ఇరవై నాలుగు గంటలూ కూతురు గురించే ఆలోచించేవాడు. కూతురు లేకుండా తాను బతకలేననుకొని...ఇల్లరికపు అల్లుని కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈలోపే శృతి ఒక యువకుడిని ఇంటికి తీసుకువచ్చి తండ్రికి పరిచయం చేసింది. ‘‘డాడీ... ఈయన అభి. గత కొంత కాలంగా మేము ప్రేమించుకుంటున్నాము. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంది శృతి. జానకిరామయ్య షాక్ అయ్యాడు... మాట్లాడుతుంది తన కూతురేనా? అని! ఎందుకంటే తన కళ్లకు... శృతి ఎప్పుడూ చిన్న పిల్లే!‘‘పెళ్లైన తరువాత శృతి, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే మంచిదనుకుంటున్నాను. నాకు కూడా అమ్మాయి తప్ప ఎవరూ లేరు కదా. నీకేమైన అభ్యంతరమా?’’ అభిని చూస్తూ అడిగాడు జానకిరామయ్య.‘‘సారీ అండీ... మా అమ్మానాన్నలకు నేనొక్కగానొక్క కొడుకును. నన్ను ఒక్కరోజు చూడకుండా ఉండలేరు’’ అంటూనే కొద్దిసేపట్లో ప్లేటు ఫిరాయించి... ‘‘శృతి కోసం ఈ మాత్రం చేయలేనా? ఇక్కడే మీతో పాటు ఉంటాను’’ అన్నాడు అభి. జానకిరామయ్యకు గాల్లో తేలి పోయినట్లు అనిపించింది.అభిని దేవుడే తన దగ్గరికి పంపించాడు అనుకున్నాడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈలోపే ఒక వార్త జానకిరామయ్య గుండెలో గునపంలా గుచ్చుకుంది.అభి మోసగాడనే విషయం బయటపడింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పెద్దింటి అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేయడం అతని అలవాటు. జానకిరామయ్య ఏ జన్మలో చేసుకున్న అదృష్టమోగానీ... అభి మోసగాడనే విషయం పెళ్లికి ముందే బయటపడింది.శృతి డిప్రెషన్‌లాంటి స్థితిలోకి వెళ్లిపోయింది.కూతురు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు జానకిరామయ్య. గాలి మార్పు కోసం భార్యాబిడ్డలను అమెరికాలోని అన్న కూతురి దగ్గరకు పంపాడు. రెండు మూడు నెలలు శృతి అక్కడ ఉంటే మళ్లీ మామూలు మనిషి అయిపోతుందనుకున్నాడు. ఒకరోజు పోలిస్‌స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.‘‘వాడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని జానకిరామయ్యకు జాగ్రత్తలు చెప్పాడు ఇన్స్పెక్టర్. జానకిరామయ్య ఇంట్లో శ్రీను అనే కుర్రాడు చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అతని పనితీరు, వినయం జానకిరామయ్యకు బాగా నచ్చాయి. శ్రీను అంటే గురి ఏర్పడింది.శ్రీను బయటికి వెళితే చాలు... తన యాజమాని భద్రతను దృష్టిలో పెట్టుకొని బయట తాళం వేసి వెళ్లేవాడు. అది శతృదుర్భేద్యమైన తాళం. ఆరోజు కూడా... ‘‘మీరు పుస్తకం చదువుతూ ఉండండి. నేను కూరగాయలు తీసుకొనివస్తాను’’ అని బయట తాళం వేసి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత...‘‘మా అయ్యగారు తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని గట్టిగా ఏడుస్తున్నాడు శ్రీను. కూతురి గురించి ఆలోచిస్తూ... మానసిక బాధతోనే జానకిరామయ్య ఆత్మహత్య చేసుకున్నాడనుకున్నారు అందరూ. అయితే... ఇన్స్పెక్టర్ నరసింహ మాత్రం ‘ఇది ఆత్మహత్య కాదు... హత్య’ అని ప్రకటించాడు. కిటికీలు లోపలి నుంచి వేసి ఉన్నాయి. బయట గట్టి తాళం వేసి ఉంది. ఏ రకంగా చూసినా... బయటి వ్యక్తి ఇంట్లోకి దూరి జానకిరామయ్యను హత్య చేసే ఛాన్సే లేదు. మరి ఆయన ఎలా హత్యకు గురయ్యాడు? క్లూ: ఎడమవైపు కిటికీ ఫ్రేమ్ దగ్గర కొన్ని నీళ్లు కనిపించాయి. శ్రీను హంతకుడు. శ్రీను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు ఎడమ వైపు ఉన్న కిటికీని తెరిచి ఫ్రేమ్‌లో ఐస్‌క్యూబ్‌లను పెట్టి... కిటికీ ఓపెన్‌గా ఉండేలా చూసుకున్నాడు. బయట తాళం వేసి తెరిచిన కిటికీ నుంచి జానకిరామయ్యను షూట్ చేశాడు. కొద్దిసేపటి తరువాత... ఐసుముక్కలు కరిగి కిటికీ దానికదే క్లోజ్ అయిపోయింది. ఐస్ కరిగి నీళ్లు మిగిలాయి. -
కత్తి ఎవరు దించారు?
పట్టుకోండి చూద్దాం ‘జానకి రామయ్యను ఎవరో హత్య చేశారట...’ ‘చీమకు కూడా ఆపద తలపెట్టని వ్యక్తిని హత్య చేశారా?’ ‘ఈ రోజుల్లో ఒక నీతి అంటూ ఉందా? హంతకులకు... మంచివాళ్లు ఏమిటి? చెడ్డవాళ్లు ఏమిటి?’ ‘ఇంతకీ ఈ హత్య ఎవరు చేసి ఉంటారు?’ ‘అది ఎవరూ చెప్పలేకపోతున్నారు!’ ‘ఆయనకు వ్యాపారప్రత్యర్థులు కూడా ఎవరూ లేరు. అందరితో స్నేహంగా ఉంటారు’ ‘ఇంతకీ ఇది హత్యేనా? లేక ఆత్మహత్యా?’ ‘ఖచ్చితంగా హత్యే... డౌటే లేదు’ కేసు దర్యాప్తు చేయడానికి ఇన్స్పెక్టర్ నరసింహ రంగంలోకి దిగాడు. ‘‘నరసింహ ఎన్నో మిస్టరీలను ఛేదించవచ్చుగాక... ఈ మిస్టరీని మాత్రం ఛేదించలేడు. ఒక్క క్లూ కూడా దొరకడం లేదట’’ అనుకున్నారు నరసింహ అంటే గిట్టని వాళ్లు. నరసింహ కళ్లలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు... మిస్టరీని ఛేదిస్తాననే ఆత్మవిశ్వాసం తప్ప. జానకిరామయ్య పీఏ ప్రియను ఇంటరాగేట్ చేశాడు నరసింహ. ఇక్కడ ప్రియను గురించి కొంచెం చెప్పుకోవాలి. ఎంతో కాలంగా ప్రియ చాలా నమ్మకంగా జానకిరామయ్య దగ్గర పనిచేస్తోంది. ఈ ప్రియ ఎవరు అనే దానిపై కూడా రకరకాల గాసిప్‌లు ప్రచారంలో ఉన్నాయి. తన భార్యకు తెలియకుండా జానకిరామయ్య వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు కలిగిన సంతానమే ప్రియ అనే వాళ్లు లేకపోలేదు. అదెంత వరకు నిజమో, అబద్ధమో తెలియదుగానీ... హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రియ కీలక వ్యక్తిగా మారింది. ఇన్స్పెక్టర్తో ఆమె చెప్పిన విషయాలు: 1. ఒక ఫైల్ ఇవ్వడానికి జానకి రామయ్యగారి క్యాబిన్లోకి వెళ్లాను. వెంటనే పెద్దగా అరిచాను. ఆయన వెన్నులో కత్తి దిగి ఉంది. 2. హత్యకు ముందు ఆయన ఎవరితోనో గొడవపడి ఫైట్ చేసినట్లు ఉన్నాడు. టేబుల్ మీద ఫైల్స్ చిందరవందరగా పడి ఉన్నాయి. రిస్ట్‌వాచ్ పగిలిపోయింది. 3. మధ్యలో ఒకసారి పెద్దగా అరుపులు వినిపించాయి. అలా అరవడం ఆయనకు అలవాటు కాబట్టి ఎప్పటిలాగే నేను పెద్దగా పట్టించుకోలేదు. 4. టేబుల్‌పై కాఫీ మరకలు కనిపించాయి. నిజానికి ఆయనకు కాఫీ తాగే అలవాటు లేదు. 5. ఛాంబర్లో ఒక మూల ఒక జత గ్లోవ్స్ కనిపించాయి. 6. నాగరాజు, విజయ్, రమణ, శ్రీనివాస్, రాఘవ... విజిటర్స్ బుక్‌లో చాలామంది పేర్లే నమోదై ఉన్నాయి. ప్రియ క్యాబిన్లోకి వచ్చాడు ఇన్స్పెక్టర్. ఓ మూలన ఉన్న డస్ట్‌బిన్‌లో రెండు కాఫీ కప్పులు కనిపించాయి. ఇన్స్పెక్టర్: ఈ కప్పుల్లో ఎవరు కాఫీ తాగారు? ప్రియ: ఒక కప్పులో నేను తాగాను... రెండో కప్పు నాగరాజుది. ఇన్స్పెక్టర్: నాగరాజు ఎవరు? ప్రియ: జానకిరామయ్యగారికి బాగా క్లోజ్ ఇన్స్పెక్టర్: నాగరాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ప్రియ: ఏదో నెంబర్ అడగడం కోసమని వచ్చాడు. మరిచిపోయి... కాఫీ కప్పు నా టేబుల్ మీదే పెట్టి వెళ్లిపోయాడు... ఆ తరువాత నేనే ఈ కప్పును డస్ట్‌బిన్‌లో పడేశాను. మరి కొద్దిసేపు దర్యాప్తు జరిపిన తరువాత ఇన్స్పెక్టర్ నరసింహ... ‘‘ప్రియా... ఈ హత్య నువ్వే చేశావు’’ అన్నాడు. ‘‘నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. ‘‘నిన్ను అనుమానించడానికి బలమైన కారణాలు ఇవి...’’ అంటూ చెప్పుకుపోయాడు ఇన్స్పెక్టర్. ప్రియ నేరం ఒప్పుకోక తప్పలేదు. ప్రియను ఇన్స్పెక్టర్ అనుమానించడానికి కారణం ఏమిటి? Ans:- 1. జానకిరామయ్యను వెనక నుంచి పొడిచారు. కాబట్టి ఫైట్ జరిగే అవకాశం లేదు. 2. ఫైట్ జరగలేదు కాబట్టి... రిస్ట్‌వాచ్ పగిలిపోయే అవకాశమే లేదు. ఇది కావాలనే చేసింది. 3. గ్లోవ్స్ వేసుకొని జానకిరామయ్యను పొడిచి ఉంటే... హంతకుడు ఆ గ్లోవ్స్‌ను అక్కడే వదిలేసి వెళ్లడు. 4. రెండు కాఫీకప్పులపై ఒక్కరివే ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఈ కారణాలతో ప్రియ చెప్పినవన్నీ అబద్ధాలనే విషయాన్ని కనిపెట్టాడు ఇన్స్పెక్టర్. -
ఎవరెన్ని కుట్రలు చేసినా రాజీనామా చేయను
గన్నవరం : ఎవరెన్ని కుట్రలు చేసినా తన పదవీకాలం 2016 సెప్టెంబర్ 30 వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య తేల్చిచెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి మద్దతు కూడా తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. పాలకవర్గంలోని ముగ్గురు డెరైక్టర్ల పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక రావ్‌ఫిన్ రియల్ ఎస్టేట్‌లోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 23 ఏళ్లుగా చైర్మన్ పదవిలో కొనసాగుతున్న తాను సంస్థ వ్యాపార టర్నోవర్‌ను రూ.27 కోట్ల నుంచి రూ.432 కోట్లకు పెంచడంతో పాటు సుప్రీంకోర్టులో రైతుల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడి విజయం సాధించినట్లు తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలోని రైతులకు బాసటగా నిలవడంతో పాటు అవినీతిపరులైన డెరైక్టర్లను బోర్డు నుంచి తప్పించానని చెప్పారు. లాభాల బాటలో ఉన్న యూనియన్ను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా సంస్థలో పనిచేస్తున్న మేనేజర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడడంతో పాటు తనను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంస్థ ఉద్యోగుల జోలికి వెళ్లినా, సంస్థకు నష్టం కలిగించే పనులు చేసినా సహించేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుకు ఆరోజు బోర్డు డెరైక్టర్ పదవి తానే ఇచ్చానన్నారు. అయితే కొంతమంది డెరైక్టర్లతో కలిసి చంద్రబాబుకు తనపై తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరమన్నారు. బాబుకు వాస్తవాలు తెలుసని, ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా తనపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. తనను రాజీనామా చేయమని బాబు ఏరోజూ కోరలేదన్నారు. సీఎం ఆదేశాల మేరకే నడుచుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తొలుత డెరైక్టర్ల ఎన్నిక రాజీకి తాను అంగీకరించినప్పటికీ ప్రత్యర్థులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని త్వరలో బాబును కలిసి వివరిస్తానని చెప్పారు. ఆ ముగ్గురిని గెలిపించండి... ఈ నెల 25న జరగనున్న పాలకవర్గంలో ఖాళీ అయిన ముగ్గురు బోర్డు డెరైక్టర్ల పదవులకు పోటీ చేస్తున్న మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి, వీబీకేవీ సుబ్బారావు, జాస్తి రాధాకృష్ణలను గెలిపించాలని మండవ కోరారు. నీతిమంతమైన పాలన కోసం వీరికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు డెరైక్టర్లు పాల్గొన్నారు.