janaki rami reddy
-
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు. వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్‌బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేష్‌కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకిరామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి 455 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి కె.సత్యనారాయణమూర్తిపై ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న పోపూరి ఆనంద్ శేషు 353 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,538 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ విధానం ద్వారా మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్ వ్యవహరించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా కోనపల్లి నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఉపాధ్యక్షుడిగా పి.నరసింహమూర్తి విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శిగా దూదేకుల ఖాసిం సాహెబ్, గ్రంథాలయ కార్యదర్శిగా మెట్టా సప్తగిరి, కోశాధికారిగా డాక్టర్ జేవీఎస్‌హెచ్ శాస్త్రి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా సందు సతీష్, మహిళా ప్రతినిధిగా ఎ.సుఖవేణి, ఈసీ సభ్యులుగా బాలినేని పరమేశ్వరరావు, ఎస్వీ భరతలక్ష్మి, ఈతకోట వెంకటరావు, కట్టా సుధాకర్, మేటపాటి సంతోష్‌రెడ్డి, రావుల నాగార్జున ఎన్నికయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల అధికారి సత్యప్రసాద్‌ను సంఘ ప్రతినిధులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన ప్రతినిధులకు, వారి గెలుపునకు కృషి చేసిన వారికి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
బలవంతపు వసూళ్లు
పొదలకూరు మండలం కనుపర్తి సర్పంచ్ అట్ల జానకిరామిరెడ్డికి పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది. బ్యాంకు నుంచి రూ.40వేలు క్రాప్ లోను తీసుకున్నాడు. జానకిరామిరెడ్డి అకౌంట్లో రూ.70వేలు నగదు ఉంది. బ్యాంకు వారు ఎటువంటి నోటీసుతో, సమాచారం ఇవ్వకుండానే ఆయన అకౌంట్లోని రూ.70వేల నుంచి రూ.40 వేలను రుణంలోకి జమ చేసుకున్నారు. గూడూరు రూరల్ మండలం చెమిర్తికి చెందిన దశయ్య గూడూరు ఎస్బీఐలో రూ.70వేలు ఎల్టీ రుణం, రూ.60వేలు క్రాప్‌లోను తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.1,70,000 అయింది. దశయ్య తాత తిరుపాలయ్యకు చెందిన స్థలంలో ఐడియా కంపెనీ సెల్ టవర్ నిర్మించింది. దీనికి సంబంధించి కంపెనీ తిరుపాలయ్యకు నెలకు రూ.7,500 చెల్లిస్తోంది. తిరుపాలయ్యకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో దశయ్య ఎస్బీఐ అకౌంట్ నంబరు ఇచ్చాడు. ఐడియా కంపెనీ వారు దశయ్య అకౌంట్లో రూ.7,500 జమ చేశారు. ఇది గమనించిన బ్యాంక్ అధికారులు రూ.7,500ను దశయ్య క్రాప్లోనులో జమ వేసుకున్నారు. సాక్షి, నెల్లూరు: బలవంతపు వసూళ్లు జానకిరామిరెడ్డి, దశయ్యకే పరిమితం కాలేదు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత. బ్యాంకులు బరితెగించాయి. రుణమాఫీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిలో ఉండడం, ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో బ్యాంకర్లు తమ పని మొదలుపెట్టారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. పాత బకాయిలను చెల్లిస్తే వెంటనే కొత్తరుణాలు ఇస్తామంటూ బేరం పెడుతున్నారు. అక్కడికి పరిమితం కాకుండా దొరికిన రైతులను దొరికినట్టే ముక్కుపిండి మరీ బకాయిలు వసూళ్లు చేస్తున్నాయి. రైతులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాలపై నిఘాపెట్టి మరీ అందిన కాడికి బలవంతపు వసూళ్లకు దిగారు. దీంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారు తమ బంధువులు, స్నేహితులైన రైతుల అకౌంట్లకు సొమ్ము వేయించుకొనేందుకు భయపడిపోతున్నారు. డబ్బులు ఎవరివైనాసరై.. ఎంత అవసరమో,ఆపదో లేక ఆడపిల్ల పెళ్లో అని కూడా బ్యాంకులు చూడడంలేదు. రైతు ఖాతాలోకి డబ్బువచ్చిందంతే..! అంటూ రుణాలకు జమవేస్తున్నారు. ప్రభుత్వం రుణాలు మాఫీపై దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నందున ఇక తమపని తాము చేసుకోవాల్సిందేనని బ్యాంకు అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కావలి, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలతో పాటు జిల్లాలో పలుచోట్ల బ్యాంకులు రైతులకు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చాయి, ఇస్తున్నాయి. ఈ విషయం బయటకు చెప్పుకునేందుకు నామోషీ కావడంతో రైతులు నోరుమెదపడంలేదు. చంద్రబాబు పుణ్యమాని రైతులు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. బాబు రుణమాఫీ హామీ లేకపోతే రైతులు వారి తిప్పలు వారు పడి జూన్ నాటికే వడ్డీలు చెల్లించి రుణాలు రీషెడ్యూల్ చేసుకొనేవారు. తిరిగి లోన్ పొంది సకాలంలో వ్యవసాయం చేసేవారు. కష్టాల వ్యవసాయంలో రుణమాఫీ రూపంలో కొంతైనా మేలుజరుగుతుందని ఆశించారు. బాబుకు ఓట్లేసి అధికారం అప్పగించారు. అధికారంలోకి వచ్చిన బాబు మాటతప్పారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి రెండునెలలు కావస్తున్నా రుణమాఫీ హామీపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు రైతులకు ఖరీఫ్ రుణాలు అందేపరిస్థితి లేకుండా పోయింది. జూలై చివరినాటికి రుణాలు అందకపోతే.. క్రాఫ్ ఇన్సూరెన్స్ అందే పరిస్థితి ఉండదు. ఇప్పటికీ ఖరీఫ్ రుణాలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.