రేపు కళాభవన్లో జానపద జాతర
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ, జానపద కళాకారుల సంఘాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమన్వయంతో జానపద జాతర–2016 ఉత్సవాలను ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనన్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
జానపద కళలను ప్రజలకు తెలియజెప్పడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ గత సంవత్సరంలాగే ఈ సారి కూడా జానపద జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 25 కళా బృందాలు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళారూపాలతో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.