Janata Dal-United
-
మణిపూర్‌లో మళ్లీ వికసించిన కమలం.. ఎన్ని సీట్లు గెలిచాయంటే..
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సత్తా చాటింది. ఒక్క పంజాబ్‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కమలం వికసించింది. ఇక మణిపూర్‌లోనూ బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలను గెలుచుకొని మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ అయిదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్పీపీ ఏడు స్థానాల్లో.. ఎన్పీఎఫ్ కూడా అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఇక జేడీయూ ఆరు చోట్ల గెలుపొందింది. ఇతరులు అయిదు స్థానంలో గెలిచారు మణిపూర్ సీఎం విజయం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ విజయం సాధించారు. హింగాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పంగేజం శరత్చంద్ర సింగ్‌పై 17 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఆ సందర్భంగా బీరెన్ సింగ్ మాట్లాడుతూ.. మణిపూర్ తదుపరి సీఎం ఎవరన్నది బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. సీఎం ఇంటి వద్ద సంబరాలు మరోవైపు మణిపూర్‌లో బీజేపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఇంఫాల్‌లోని బీజేపీ కార్యాలయం ముందు బాంబులు పేల్చారు. సీఎం బీరెన్ సింగ్ ఇంటి వద్ద మహిళలందరూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని.. సంప్రదాయ నృత్యాలలతో అలరించారు. #WATCH | Celebrations at the residence of Manipur CM N Biren Singh in Imphal as BJP leads in the state as per official EC trends. CM N Biren Singh leading in Heingang by 18,271 votes. pic.twitter.com/4AUbchWfAm — ANI (@ANI) March 10, 2022 #WATCH | Firecrackers being burst at BJP office in Imphal, celebrating the party's performance in #ManipurElections pic.twitter.com/xHAeseqOv9 — ANI (@ANI) March 10, 2022 అప్పుడు- ఇప్పుడు 2017 మణిపూర్ ఎన్నికల్లో 60 స్థానాల్లో. 28 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ మణిపూర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది. కానీ ప్రభుత్వం ఏర్పాటులో అక్కడే అంచనాలు తారుమరయ్యాయి. 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్పీపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతు లభించడంతో మ్యాజిక్ ఫిగర్ 31కు చేరుకుంది. బీరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. పార్టీ 2017 2022 బీజేపీ 21 32 కాంగ్రెస్ 28 5 ఎన్పీపీ 4 7 ఎన్పీఎఫ్ 4 5 జేడీయూ 0 6 ఇతరులు 3 5 -
ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం!
గతేడాది బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయేలో భాగస్వామ్యమైన చిరాగ్ పాశ్వాన్, మరో భాగస్వామి నితీశ్ కుమార్‌కు కంట్లో నలకలా మారారు. ఎన్డీయే కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీశ్‌కు చికాకులు తెచ్చారు. ఒకపక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీశ్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతికష్టం మీద ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా, దాదాపు 35 సీట్లను జేడీయూ కోల్పోయింది. దాంతో తొలిసారి మిత్రపక్షం బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎల్జేపీని బలహీన పర్చే ప్రయత్నాలను జేడీయూ ముమ్మరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి అదను కోసం చూస్తున్న నితీశ్ చాణక్యం వల్లనే తాజాగా ఎల్జేపీలో ముసలం పుట్టిందంటున్నారు. చిరాగ్‌ను ఒంటరి చేసేలా... మిగతా ఎంపీలకు దగ్గరవుతూ నితీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎల్జేపీకి ఉన్న 6గురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరు కుంపటి పెట్టుకొని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. లోక్ జనశక్తి అధినేత పదవిని సైతం చిరాగ్ వదులుకొని తన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు పగ్గాలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక నితీశ్ పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎల్జేపీ ఎంపీలతో నితీశ్ నేరుగా సంప్రదింపులు జరిపారని, ఈ వ్యవహారాన్ని జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ద్వారా నడిపించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రామ్‌విలాస్ మృతితో బీజాలు పశుపతి పరాస్తో మహేశ్వర్ హజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి, కొడుకు మధ్య విబేధాలున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం పశుపతికి, చిరాగ్‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల్లో విడిగా పోటీచేయాలన్న చిరాగ్ నిర్ణయాన్ని అప్పట్లోనే పశుపతి వ్యతిరేకించారు. అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పశుపతిని నితీశ్ దగ్గరకు తీశారని సదరువర్గాల సమాచారం. దీంతో పాటు తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఒకరైన వీణా సింగ్ జేడీయూ నుంచి సస్పెండయిన ప్రజాప్రతినిధి భార్య. తిరిగి నితీశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఈ నేత ఎంతో యత్నిస్తున్నారు. దాంతో వీణాసింగ్ మద్దతు సులభంగానే పరాస్‌కు లభించింది. అలాగే మరో ఎంపీ అనారోగ్యం పాలైనప్పుడు నితీశ్ వ్యక్తిగతంగా ఆయన బాగోగులపై ఆరా తీశారు. ఇలా ప్రతి ఎంపీతో ఏదోరకంగా సత్సంబంధాలు నెరపడం, అటు పశుపతిని దువ్వడం ద్వారా నితీశ్ తాను అనుకున్నది సాధించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఎల్జేపీకి ఉన్న ఏకైక ఎంఎల్ఏ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో జేడీయూకు మద్దతు పలికారు. నితీశ్ పంచన చేశారు. ఉన్న ఒక్క ఎంఎల్సీ బీజేపీలో చేరారు. అప్పుడైనా చిరాగ్ మేలుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను మోదీకి హనుమంతుడి లాంటివాడినని చిరాగ్ ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం నితీశ్‌తో సంధి తప్ప ఆయన్ను కాపాడే మార్గాలేవీ లేవంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో ఉంటూనే జేడీ (యూ)ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చనే వాదనలు అప్పట్లో వినిపించాయి. నితీశ్‌ను బలహీనపర్చి... తమపై ఆధారపడేలా చేసే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే చిరాగ్‌ను జేడీయూపైకి ప్రయోగించారని అంటారు. చివరకు అదే జరిగింది. జేడీయూకు కంటే బీజేపీకి ఎక్కవ స్థానాలు గెలిచినా... ఎన్నికలకు ముందు ప్రకటించిన మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసి... బీజేపీ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పుడు చిరాగ్... ఒంటరిగా మిగిలే పరిస్థితులు వచ్చినపుడు అది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ అంటోంది. రాజకీయాలు తెలిసి రావాలంటే చిరాగ్‌కు ఇంకా సమయం పడుతుందేమో. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకురావడంలో మోడీ విఫలమయ్యారని నితీష్ ఆరోపించారు. గురువారం పాట్నాలో జనతాదళ్ (యూ) నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నితీష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకు వస్తామని మోడీ చెప్పారు.... కానీ ఆయన అధికారాన్ని చేపట్టి 150 రోజులు అయింది.... ఇప్పటి వరకు ఆ అంశంపై అతిగతి లేదన్నారు. అసలు మోడీకి విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన సొమ్ము ఎంతో తెలియదని నితీష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక బీజేపీ మైండ్ సెట్ మారిందని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బరస్ట్ ఝూట్ పార్టీ అని నితీష్ అభివర్ణించారు.