బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ | Modi fails on black money: Nitish | Sakshi
Sakshi News home page

బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ

Published Thu, Nov 13 2014 8:14 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ - Sakshi

బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకురావడంలో మోడీ విఫలమయ్యారని నితీష్ ఆరోపించారు. గురువారం పాట్నాలో జనతాదళ్ (యూ) నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నితీష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకు వస్తామని మోడీ చెప్పారు.... కానీ ఆయన అధికారాన్ని చేపట్టి  150 రోజులు అయింది.... ఇప్పటి వరకు ఆ అంశంపై అతిగతి లేదన్నారు.

అసలు మోడీకి విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన సొమ్ము ఎంతో తెలియదని నితీష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక బీజేపీ మైండ్ సెట్ మారిందని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బరస్ట్ ఝూట్ పార్టీ అని నితీష్ అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement