Former Bihar chief minister
-
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
'రిజర్వేషన్‌ను వదులుకుంటున్నా.. ఇక జనరల్‌గానే '
పాట్నా: తాను రాజకీయాల్లో పోటీచేసేందుకు రిజర్వేషన్ ఉపయోగించుకోనని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయబోమని, జనరల్ స్థానాల నుంచే పోటీ చేస్తామని చెప్పారు. 'రిజర్వేషన్ లబ్ధిని పొందకూడదని మేం నిర్ణయించుకున్నాం. మాలో ఎవరు బలహీనమైనవారు ఉన్నారో వారే దానిని పొందడానికి అర్హులు అని మాంఝీ చెప్పాడు. మాంఝీ మహాదళిత్ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రిజర్వేషన్ సీటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనే స్వయగా రిజర్వేషన్ అనేది నిజంగా అభివృద్ధి చెందని వారికి దక్కాల్సినదని, అందుకే తాను రిజర్వేషన్ నుంచి పక్కకు జరిగి జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. బలహీన వర్గాల్లో ఉన్నతులుగా మారినవారు తమ ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో తమ రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బీజేపీ అంటే బరస్ట్ ఝూట్ పార్టీ
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకురావడంలో మోడీ విఫలమయ్యారని నితీష్ ఆరోపించారు. గురువారం పాట్నాలో జనతాదళ్ (యూ) నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నితీష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని తీసుకు వస్తామని మోడీ చెప్పారు.... కానీ ఆయన అధికారాన్ని చేపట్టి 150 రోజులు అయింది.... ఇప్పటి వరకు ఆ అంశంపై అతిగతి లేదన్నారు. అసలు మోడీకి విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన సొమ్ము ఎంతో తెలియదని నితీష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక బీజేపీ మైండ్ సెట్ మారిందని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బరస్ట్ ఝూట్ పార్టీ అని నితీష్ అభివర్ణించారు. -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయను: రబ్రీదేవి
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి చెప్పారు. ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె మీసా భారతి కానీ పోటీ చేసేదిలేదని ఆదివారం స్పష్టం చేశారు. బీహార్‌లోని సరన్ లోక్‌సభ నియోజకవర్గానికి లాలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాణా కుంభకోణంలో ఆయనకు జైలు శిక్ష విధించడంతో ఎంపీగా అనర్హత వేటుపడనుంది. ఈ నేపథ్యంలో సరన్ నుంచి రబ్రీదేవి పోటీచేస్తారని వచ్చిన వార్తల్ని ఆమె తోసిపుచ్చారు. లాలూ జైల్లో ఉన్నా ఆర్జేడీకి సారథ్యం కొనసాగిస్తారని రబ్రీదేవి పేర్కొన్నారు.