Janavani
-
తెచ్చిన వారితో నచ్చిన తీరుతో జనవాణి
దొండపర్తి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమం ప్రభుత్వంపై నిందలకే పరిమితమైంది. ఒక్క సమస్యనూ ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. బాధితులకు భరోసా కూడా ఇవ్వలేదు. గురువారం విశాఖలోని దసపల్లా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం మొత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా, జనసేన నేతలకు నచ్చిన విధంగా నిర్వహించారు. ముందుగా ఎంపిక చేసి తెచ్చిన వారితోనే వినతులు ఇప్పించారు. వారి సమస్యలకూ పవన్ పరిష్కారం చూపకుండా ప్రతిదానికీ ప్రభుత్వంపై నిందలేశారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన పవన్ 11.30కు వచ్చారు. ముందుగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఐదుగురు జనసేన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం కొందరు భూ సమస్యలు వివరించగా.. ఉత్తరాంధ్రలో భూములను వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్నారంటూ ఏవేవో ఆరోపణలు చేశారు. తమ కుమార్తె రెండేళ్లుగా కనిపించడంలేదని మడిగట్ల శ్రీనివాస్ దంపతులు చెప్పగా.. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించడంలేదని ఇప్పటికే చెప్పానని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వైద్య పరీక్షలు చేయడంలేదని కొందరు చెప్పగా.. ఎల్జీ పాలీమర్స్ బాధితులకే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్.. విశాఖను రాజధాని ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమను ఆదుకోవాలని కొందరు దివ్యాంగులు కోరగా.. మన ప్రభుత్వం వస్తే కూర్చోబెట్టి పోషిస్తానని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ అంశం దాటవేత స్టీల్‌ప్లాంట్ లాభాల్లోకి వచ్చేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రతినిధులకు పవన్ ఎటువంటి భరోసా ఇవ్వలేదు. సెయిల్‌లో విలీనం సహా ప్లాంట్ లాభాల్లోకి వచ్చే అంశాలను వారు వివరిస్తుండగానే పవన్ అడ్డుకొన్నారు. దీనిపై తరువాత చర్చిద్దామంటూ పంపేశారు. యూనివర్సిటీల్లో ప్రక్షాళన జరగాలి యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మినిమం టైం స్కేల్ అమలు చేయడంలేదని కొందరు వినతిపత్రం ఇవ్వగా.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ప్రక్షాళన జరగాలని పవన్ అన్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఆంధ్రా వర్సిటీ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంగా మారిపోయిందని, దీనిని హెచ్ఆర్డీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గంగవరం పోర్టు జీతాలపై కొందరు కార్మికులు వినతిపత్రం ఇవ్వగా ఈ అంశాన్ని ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. దివిస్, హెటిరో కంపెనీలపై ఫిర్యాదులు రాగా.. ఉత్తరాంధ్ర కాలుష్యంతో నిండిపోయిందని, ఈ సమస్యను పరిష్కరించలేని జగన్.. విశాఖను రాజధానిగా ఏం చేస్తారని విమర్శించారు. అనేక మంది వినతులు ఇచ్చేందుకు వచ్చినప్పటికీ మరోసారి జనవాణి నిర్వహిస్తామని చెప్పి పంపించేశారు. -
పవన్.. గో బ్యాక్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖలో చుక్కెదురైంది. ఊహించని రీతిలో స్థానికుల నుంచి నిరసనల సెగ తగిలింది. ‘పవన్ గో బ్యాక్’ అంటూ యావత్తు విశాఖ నినదించింది. ఆదివారం ఉదయాన్నే పవన్ ‘జనవాణి’ నిర్వహించనున్న పోర్టు స్టేడియం ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానిక మహిళలు, నాన్ పొలిటికల్ జేఏసీ మద్దతుదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వపన్ కల్యాణ్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హతలేదని నినదించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయినా నిరసనకారులు అక్కడికి వస్తూనే ఉండటంతో.. పరిస్థితి అనుకూలంగా లేదని భావించిన పవన్ కల్యాణ్.. తన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఒక దశలో విశాఖ నుంచి తిరిగి వెళ్లిపోవటానికి సిద్ధమై.. మళ్లీ అంతలోనే మనసు మార్చుకున్నారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిగ్నల్ వద్ద మానవహారంగా ఏర్పడిన స్థానికులు విశాఖ గర్జనను పక్కదారి పట్టించాలని.. వికేంద్రీకరణకు మద్దతుగా శనివారం జోరు వానలోనూ విశాఖ గర్జన విజయవంతం అయిన నేపథ్యంలో.. తమ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ ఆదివారం జనవాణి కార్యక్రమం నిర్వహించతలపెట్టిన పోర్టు స్టేడియం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ‘ఉత్తరాంధ్ర ద్రోహి.. పవన్ కల్యాణ్ గో బ్యాక్..’ అంటూ నినదించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా, నిరసన సెగ తప్పదని స్పష్టం చేశారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా తోడయ్యాయి. ఉత్తరాంధ్ర జేఏసీ నేతలతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కేకే రాజు నేతృత్వంలో పలువురు నేతలు భారీగా అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. ఫలితంగా తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను నిరసిస్తూ జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రోడ్డుపై పడుకుని మహిళల నిరసన తమ కార్యకర్తలు బయటకు వచ్చే వరకూ విశాఖ వదిలి వెళ్లనని నోవాటెల్ హోటల్లోనే ఉండిపోయారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు.. వికేంద్రీకరణకు జనసేన పూర్తిగా వ్యతిరేకమని, విశాఖ పరిపాలన రాజధాని కావడం ఏ మాత్రం ఇష్టం లేదని మరోసారి ప్రత్యక్షంగా స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు. -
బురద జల్లడమే జనవాణి అజెండా.. ఫ్యాక్ట్ చెక్
సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. విజయవాడలో ఆదివారం జరిగిన ‘జనవాణి’ వేదికగా వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ తన అక్కసు వెలిబుచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళ పేరుతో అవాస్తవాలను వల్లించారు. ఆమె స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకుడు కబ్జా చేశాడంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆమె స్థలం కబ్జాకు గురైందన్న ఆరోపణలపై విచారణలో వెలుగు చూసిన అంశాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పవన్ డ్రామాలు కలెక్టర్ నివేదికతో బహిర్గతమయ్యాయి. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలను పరిశీలిస్తే... తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం తారకరామ నగర్లో అనిత అనే మహిళకు 2004లో ప్రభుత్వం ప్లాట్ నంబర్ 2400లో ఇంటి పట్టా కేటాయించింది. 6 నుంచి 12 నెలల్లోగా అందులో ఇల్లు లేదా గుడిసె నిర్మించుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది. ► 2004 నుంచి తమకు కేటాయించిన ప్లాట్లలో గుడిసె / ఇల్లు నిర్మించుకోని 989 మందికి 2018లో టీడీపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్లాట్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు పంపిణీ చేపట్టింది. ► ఈ క్రమంలో ప్లాట్ నంబరు 2400ని గత సర్కారు వి.వెంకటేష్ అనే వ్యక్తికి కేటాయిస్తూ 2018లో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. అందులో వెంకటేష్ షెడ్డు నిర్మించుకుని ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు. ►షెడ్డు నిర్మిస్తున్న సమయంలో అనిత, వెంకటేష్ మధ్య వివాదం చోటు చేసుకుంది. అనిత షెడ్డును స్వాధీనం చేసుకోవడంతో ఆమెపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అనిత నుంచి షెడ్డును స్వాధీనం చేసుకున్న వెంకటేష్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించుకున్నాడు. ► వైఎస్సార్సీపీతో వెంకటేష్‌కు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ వివాదం 2019 తర్వాత చోటు చేసుకున్నది కూడా కాదు. -
భారత జనవాణి..ఆకాశవాణి
ప్రశంసించిన గవర్నర్ సమైక్యతను చాటిన సాహిత్యోత్సవం కోలాహలంగా జాతీయ కవి సమ్మేళనం తరలివచ్చిన అనేకమంది కవులు సాక్షి,సిటీబ్యూరో: జాతి సమైక్యతను, దేశభక్తిని, సౌభ్రాతృత్వాన్ని చాటుతూ వివిధభాషల్లో కవులు వినిపించిన కవితలు అద్భుతంగా,స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. తమ కవితల్లో మొత్తం దేశాన్ని ప్రతిబింబించారని, ఇది అరుదైన సందర్భమని ప్రస్తుతించారు. ఆలిండియో రేడియో, ఆకాశవాణి డెరైక్టర్ జనరల్ గురువారం ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ‘జాతీయ కవిసమ్మేళనం-2014’ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 22 భారతీయ భాషల్లోని సుప్రసిద్ధ కవులు,22 మంది హిందీ,మరో 22 మంది తెలుగు అనువాదకవులతో నగరంలో తొలిసారి ఏర్పాటుచేసిన జాతీయ కవి సమ్మేళనం సాహిత్యోత్సవాన్ని తలపించింది. గవర్నర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన అగ్రశ్రేణి కవులు హైదరాబాద్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సమాచార సాంకేతిక విప్లవం ఫలితంగా వందలకొద్దీ చానళ్లు, ఎఫ్ఎం రేడియోలు రాజ్యమేలుతున్నప్పటికీ ఆకాశవాణి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందన్నారు. ఆకాశవాణి గొప్ప విశ్వసనీయతను కలిగివుందని, ఇప్పటికీ కచ్చితమైన సమయం తెలుసుకోవాలంటే రేడియో వినాల్సిందేనని గుర్తుచేశారు. ఆకాశవాణి భారత జనవాణి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిఫ్యూటీ డెరైక్టర్ జనరల్ ఆదిత్యప్రసాద్ గవర్నర్‌కు రేడియోసెట్ను బహూకరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆలిండియా రేడియో డెరైక్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక మార్పునకు రేడియో ఎంతో కృషిచేస్తోందన్నారు. అంతకుముందు కవిసమ్మేళనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖకవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె మాట్లాడుతూ ఆకాశవాణి ఇలాంటి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం ఎంతో మంచి సంప్రదామంటూ..ఇంతమంది కవులను ఒక్కచోట చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వైవిధ్యభరిత కవనం: ప్రముఖ సంస్కృత కవి ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి సంస్కృతంలో రాసిన ‘కేదార విలయ తాండవం’ కవితతో మొదలైన కవి సమ్మేళనం 22 భాషల్లో సుదీర్ఘంగా సాగింది. ఆయా కవితలనుహిందీలోకి అనువదించేందుకు 22 మంది హిందీకవులు, తెలుగులోకి అనువదించేందుకు మరో 22 మంది తెలుగుకవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.