విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
ఆత్మకూరు: నల్లగొండ జిల్లా ఆత్మకూరు.ఎం మండలం రాఘవాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు జానీమియా శుక్రవారం సాయంత్రం పొలానికి నీరు పెడుతున్న సమయంలో విద్యుత్ ప్రసారం నిలిచిపోయింది.
దగ్గరలోని ట్రాన్స్ఫారం దగ్గరకు వెళ్లి చూడగా ఫీజు పోయినట్టు కనిపించింది. దీంతో విద్యుత్ సిబ్బంది వచ్చే సరికి ఆలస్యం అవుతుందన్న భావనతో జానీమియా ఫీజు వేసేందుకు ప్రయత్నించాడు. షాక్ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడ్ని కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.