Jangareddy
-
జంగారెడ్డి మృతిపట్ల పీఎం మోదీ సంతాపం
సాక్షి, ఢిల్లీ: మాజీ బీజేపీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి.. సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రధాని మోదీ సంతాప ప్రకటన విడుదల చేశారు. ‘జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి మాజీ ఎంపీ జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. అనేకమంది బీజేపీ కార్యకర్తలకు ఆయన ప్రేరణ ఇచ్చార’ని ప్రధాని కొనియాడారు. Shri C Janga Reddy Garu devoted his life to public service. He was an integral part of the efforts to take the Jana Sangh and BJP to new heights of success. He made a place in the hearts and minds of several people. He also motivated many Karyakartas. Saddened by his demise.— Narendra Modi (@narendramodi) February 5, 2022 బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కరెంట్ జంగన్నగా పేరుపొందారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి పట్ల కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని ఆయన మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని, జనం మధ్య పనిచేస్తూ ప్రజా ప్రతినిధిగా అనేక సార్లు గెలిచారని గుర్తుచేసుకున్నారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడు జంగారెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా చేయించడంలో, మోటార్లు కరెంటు మోటార్లు బిగించడంలో విశేష కృషి చేస్తూ కరెంట్ జంగన్నగా పేరుపొందారని తెలిపారు. జంగారెడ్డి కృషి చిరస్మరణీయం బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యా సాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి.. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఈరోజు బీజేపీ తెలంగాణలో ఈ స్థాయిలో ఉందంటే.. అందులో ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు. జంగారెడ్డి.. నేటి తరానికి ఆదర్శనీయం.. బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ నేత లక్ష్మణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేయడానికి జంగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. జంగారెడ్డి లాంటి వ్యక్తులు వేసిన పునాదులే ఈరోజు బీజేపీ మహావృక్షంగా ఎదగడానికి కారణమయ్యాయని తెలిపారు. జంగారెడ్డి.. నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శనీయమని చెప్పారు. రాజకీయాల్లో ఉండేవాళ్లు మడమ తిప్పకుండా జనం కోసం నిరంతరం శ్రమించాలని జంగారెడ్డి చెప్పేవారని తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాడేవారు బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ.. విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేసుకున్నారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని చెప్పారు. -
బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత
సాక్షి, హనుమకొండ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి... హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. జంగారెడ్డి పార్థివదేహానికి హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు. కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డితో జంగారెడ్డి(ఫైల్ ఫోటో) వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ట జంగారెడ్డి 18 నవంబర్ 1935న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. జంగారెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొదారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్‌గా పనిచేశారు. చదవండి: రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ -
కల్తీపాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ పాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. జంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే నకిలీ పాలు వస్తున్నాయన్నారు. యూరితోపాటు పాలు తయారు చేసి విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాలపై ముఖ్యమంత్రి స్పందించడం అభినందనీయమన్నారు. పాల బూత్, పాల శీతలీకరణ కేంద్రాలపై దాడులు చేయాలన్నారు. రైతు సంఘం బలోపేతం కోసం వచ్చే నెలలో జిల్లా, మండల మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని.. ఈ సమావేశానికి ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికారాలు.. ఆత్మగౌరవమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నిధులు, అధికారాలు, ఆత్మగౌరవం సాధనే లక్ష్యంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ(జెడ్పీటీసీ) సభ్యుల ఫోరం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన జెడ్పీటీసీ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ విలేకరులకు వివరించారు. ఏమాజీ మాట్లాడుతూ.. ప్రజలతో నేరుగా ఎన్నుకోబడిన జెడ్పీటీసీలకు నిధులు, అధికారాలు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ఆత్మగౌరవ సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని ఫోరం నిర్ణయించిందన్నారు. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 7న చలో అసెంబ్లీకి ఫోరం పిలుపునిచ్చిందని, తమతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన ఎంపీటీసీలను కూడా కలుపుకుని జేఏసీగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. 7న ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన ర్యాలీలో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొని చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో చలో పార్లమెంట్.. జెడ్పీటీసీలకు నిధుల కేటాయింపును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్‌లో ‘చలో పార్లమెంట్’ పేరిట ఆందోళన చేపడతామని ఏమాజీ చెప్పారు. వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే బీఆర్జీఎఫ్ గ్రాంటును, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే ఐఏపీ నిధులను కేంద్రం నిలిపేసిందన్నారు. ఆర్థిక సంఘం నిధుల్లో ఇంతకుమునుపు 20 శాతం జెడ్పీటీసీల ద్వారా, 30 శాతం ఎంపీటీసీల ద్వారా అభివృద్ధి పనులకు కేటాయించేవారని చెప్పారు. తాజాగా 14వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం నిలిపివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే రహదారి మరమ్మత్తు పనుల(ఎంఆర్ఆర్, సీఆర్ఆర్) నిధులు కూడా గతంలో జెడ్పీటీసీల ఆమోదంతో జరిగేవని, అయితే ఏడాదిన్నరగా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. జెడ్పీటీసీల ఫోరం డిమాండ్లను నెరుస్తామని గత వారం హామీ ఇచ్చిన పంచాయతీరాజ్ మంత్రి.. ఏఏ డిమాండ్లను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలు ఫోరం గౌరవాధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే విధంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలనే మండలికి పంపుతామన్నారు. కొందరు ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయమైన తమ డిమాండ్ల సాధనకై ఆందోళన చేపడుతోంటే అధికార టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు తలొగ్గేది లేదని, చలో అసెంబ్లీ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు తానాజీరావు, అంజయ్యయాదవ్, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సతీశ్, సునీత, మోహన్‌రెడ్డి, ఈశ్వర్‌నాయక్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.