Janmabhoomi Committee
-
జన్మభూమి కమిటీలతో దోచుకున్నది టీడీపీ నేతలే
మాడుగుల: చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో పథకానికో పేరు పెట్టి పేద ప్రజలను దోచుకున్న నీచ చరిత్ర టీడీపీ నేతలదని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దుయ్యబట్టారు. ఆయన శనివారం అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థపై మాట్లాడే హక్కు అయ్యన్నపాత్రుడికి లేదని అన్నారు. జన్మభూమి కమిటీల పేరిట సర్పంచ్‌లు, ఎంపీటీసీల హక్కులను కాలరాసి, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కాదా.. అని ప్రశ్నించారు. మద్యం డిస్టలరీలకు లైసెన్స్‌ల జారీలో కోట్లాది రూపా యలు దోచుకున్నది టీడీపీ నేతలేనని, దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు లైసెన్స్‌లు మంజూరు చేశారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ రాజకీ యాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో ప్రజల చెంతకే పాలనను అందిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. టీడీపీ దోపిడీ, అరాచకాలను భరించలేక ప్రజలు 2019 ఎన్నికల్లో ఆ పార్టీని, నర్సీపట్నంలో అయ్యన్నను చిత్తుగా ఓడించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని గుర్తించే టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రావాలని అయ్యన్నకు సవాల్ విసిరారు. -
దోపిడీ కోసమే జన్మభూమి కమిటీల ఏర్పాటు
► తక్షణం కమిటీలను రద్దు చేయాలి ► రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం వెల్లడి ఫిరంగిపురం : ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారిని దోచుకోమని ప్రజలపై వదిలేశారని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ధ్వజమెత్తారు. ఫిరంగిపురం మండల కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు తలకోల డేవిడ్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు అంబేడ్కర్ పేరును కూడా తలచే అర్హతలేదని చెప్పారు. అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారాన్ని పొందిన ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకొని పాలన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఈ నెల 20న గుంటూరులోని మహిమా గార్డెన్స్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని మండల్లాలోని పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధ విభాగాలనూ కలుపుకొని అన్ని వర్గాలతో కలిసి సామాజిక న్యాయ సాధికారిత యాత్ర ముగించామన్నారు. అనంతరం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ముగింపు సభలో పీసీసీ అధ్యక్షుడు రాఘవీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొంటారన్నారు. కొరివి వినయ్‌కుమార్, బండ్ల పున్నారావు, తలకోల డేవిడ్, తిరుపతి సత్యం, పాలపాటి అనీల్, పసల రాజు, దాసరిరాజు పాల్గొన్నారు. -
కన్నీరు మున్నీరు
►పదివేలకు పైగా పింఛన్లకు కోత ► జీవనాధారంకోల్పోతున్న నిరుపేదలు ► అంతా జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే.. పెన్షన్ ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకుంటున్నారు. నోటికాడ కూడు లేకుండా చేస్తున్నారు. ఆధార్ డబుల్ ఎంట్రీఅని..ఆధార్ నంబర్ అప్లోడ్ కాలేదని.. వేలిముద్రలు పడడంలేదని ఇలా కారణాలేవైనా సరే ప్రతి నెలా 1500 నుంచి రెండువేల మంది పింఛన్లకు కోత పెడుతున్నారు. ఇలామూడునెలల పాటు కోత పడిన వారికి పూర్తిగా పింఛన్ మంజూరును నిలిపివేస్తున్నారు. ఎవరికి చెప్పు కోవాలో ఏం చేయాలో తెలియక అభాగ్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలా ఐదు నెలల్లో జిల్లాలో 9,296 మందికి పింఛన్లు రద్దు చేశారు. సాక్షి, విశాఖపట్నం: పట్టెడన్నం పెట్టే పింఛన్లకోసం నిరుపేదలు గతంలో ఎన్నడూ లేనంతగా పడరాని పాట్లు పడుతున్నారు. ఎప్పుడొస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో తెలి యదు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు పింఛన్ చేతికొచ్చే వరకు వృద్ధులు.. వితంతు వులు..వికలాంగులు పడే పాట్లు వర్ణనాతీతం. టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు జిల్లాలో 3.28లక్షల పింఛన్లు ఉండేవి. ఆ తర్వాత జన్మభూమి కమిటీల పేరిట 25వేలకు పైగా పింఛన్లకు కోతపెట్టారు. ఆతర్వాత తొలగించినవాటిలో సుమారు 9వేల పింఛన్లను పునరుద్ధరించారు. గతేడాది అక్టోబర్‌లో 15వేల పింఛన్లను కొత్తగా మంజూరు చేశారు. దీంతో అక్టోబర్‌లో పెన్షన్‌దారుల సంఖ్య 3,25,585కు చేరింది. వీరికి రూ.35.62 కోట్లు ప్రతీనెలా పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం ఒకే ఒక్క నెలలో మాత్రమే నూరు శాతం పింఛన్లు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రతీ నెలా రెండువేలకు తక్కువ కాకుండా కోత పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,15,289కి తగ్గిపోయింది. అంటే 10వేలకు పైగా పింఛన్లకు కోత పడింది. ఐదు నెలలుగా కోతలే కోతలు జిల్లా వ్యాప్తంగా గడిచిన ఐదు నెలల్లో వరుసగా పింఛన్ల సంఖ్య నవంబర్‌లో 3,23,197, డిసెంబర్లో 3,17,348, జనవరిలో 3,17,170, ఫిబ్రవరిలో 3,16,404 చొప్పున తగ్గిపోగా..మార్చి కొచ్చే సరికి వాటి సంఖ్య 3,15,289కు పడిపోయింది. ఇలా ప్రతీ నెలలో 1500కు తక్కువ కాకుండా పింఛన్లకు కోతపడుతూనే ఉంది. మరో రెండు మూడు నెలలకొచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 3 లక్షలకు తగ్గిపోతుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. వీటిలో సగానికి పైగా పింఛన్లు మూడు నెలల పాటు వరుసగా తీసుకోలేదనే సాకుతో జాబితాల నుంచే తొలగించేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో రూ.35.62కోట్లు పంపిణీ చేయగా మార్చిలో రూ.31.36కోట్లకు తగ్గిపోయింది. అంటే రూ.4.30కోట్ల మేర లబ్ధిదారులకు కోతపడింది. ప్రతీ నెలా 5వ తేదీకల్లా పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఏ నెలలోనూ 20వ తేదీలోపు పంపిణీ పూర్తి చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మైదాన ప్రాంతాల్లోనే కాదు.. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ పని చేయక.. వేలి ముద్రలు పడక వృద్ధులు..వికలాంగులు ఒకటికి పదిసార్లు కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. జన్మభూమి కమిటీలదే పెత్తనం.. పంపిణీ అంతా జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే జరుగుతోంది. పేరుకు కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేస్తున్నప్పటికీ పెత్తనమంతా ఈ కమిటీలే చేస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోకి వెళ్లలేక కార్యదర్శులు పంపిణీ బాధ్యతలను జన్మ భూమి కమిటీలకు అప్పగిస్తే వారు ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.వంద నుంచి రూ.200 వరకు కమీషన్ నొక్కేస్తున్నారు.ఆధార్ డబుల్ ఎంట్రీ, ఆధార్ మిస్‌మ్యాచ్ వల్లే కోతపడుతున్నదని అధికారులంటున్నారు. వేలిముద్రలు పడకపోయి నప్పటికీ కార్యదర్శలు, రెవెన్యూ సిబ్బంది వేలిముద్రలతో ఇచ్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా సుమారు 35వేలకు పైగా పింఛన్ల పంపిణీ జిల్లాలో జరుగుతుందని చెబుతున్నారు. జన్మభూమి మావూరుతో పాటు గ్రీవెన్స్లలో వచ్చిన ఫిర్యాదుల్లో కొత్త పింఛన్ల కోసం 3,41,826 వరకు దరఖాస్తులు ఉన్నాయి. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలమాటెలాగున్నా జన్మభూమి, మావూరులో వచ్చిన వాటిల్లో 4ః1 నిష్పత్తిలో నాలుగు అర్జీలకు ఒక అర్జీని మాత్రమే అప్లోడ్ చేశారు. ఈ విధంగా గతేడాది 36,550 అర్జీలను మాత్రమే అప్లోడ్ చేశారు. వయస్సు సరిపోలేదని, భూములు ఉన్నాయంటూ కుంటి సాకులతో 19,136 అర్జీలను తిరస్కరించారు. 17,414 మంది అర్హులని జన్మభూమి కమిటీలు లెక్కతేల్చగా 15వేల పింఛన్లు మంజూరు చేశారు. తాజాగా మరో 17వేల దరఖాస్తులను అప్లోడ్ చేశారు. ఓ పక్క కోతపెడుతూనే మరో పక్క ఇలా అరకొర పింఛన్లతో పూత రాస్తున్నారన్న వాదన ఉంది. ఒకసారి నిలిపివేసిన పింఛన్లను మళ్లీ పునరుద్ధరించడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని అధికారులే సెలవిస్తున్నారు. దీంతో ప్రతీ నెలా సాంకేతిక కారణాలతో పింఛన్లు కోల్పోతున్న నిరుపేదలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
చంద్రబాబు విఫలం
మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 200 మంది చేరిక కారంపూడి : రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చారని, ఆయన అనుభవం పెరిగేకొద్దీ పాలనలో ఘోరంగా విఫలమవుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒప్పిచర్ల గ్రామంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పక్షపాత పాలనకు చంద్రబాబు తెరతీశారని ఆయన అన్నారు. అన్నీ అయిన వారికే అన్న చందంగా పాలన సాగిస్తూ ఏ పార్టీకి చెందని సామాన్య ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు మేలు చేస్తూ, సామాన్య ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. చివరకు ఎమ్మెల్యేలకు అందించే ఏసీడీపీ గ్రాంటులను కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పేదే నిజమైతే, వారితో రాజీనామా చేయించి మళ్లీ ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ రామకృష్ణయ్య, మాజీ ఎంపీపీ పంగులూరి చినవెంకటనర్సయ్య పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు ఒప్పిచర్ల శివారు ఎర్రపాలెం గ్రామానికి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఎమ్మెల్యే పీఆర్కే సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారి ఇళ్లకు ఎమ్మెల్యే వెళ్లి పలకరించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించారు. పార్టీ మండల కన్వీనర్ పంగులూరి రామకృష్ణయ్య, గ్రామ అధ్యక్షుడు ఆముదాలపల్లి రవి తదితర నాయకుల సమక్షంలో గ్రామస్తులను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీకి ఓటు వేసి ఎరుగని ఎర్రపాలెం గ్రామస్తులు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరడంపై స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్కే మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.