14 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : నరసాపురంలోని రుస్తుంబాద గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి మహిళల, పురుషుల కబడ్డీ ఇన్విటేషన్ కప్ పోటీలు వచ్చే జనవరి 14 నుంచి 18 వరకూ ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్టు పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. శనివారం గోగులమ్మ ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీలకు రుస్తుంబాదలోని స్టేడియంను సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 20 పురుషుల జట్లు 20, 15 మహిళల జట్లు పోటీలకు హాజరవుతాయన్నారు. పురుషుల విభాగంలో మొదటి బహుమతి రూ. లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు, నాలుగో బహుమతిగా రూ.25 వేలు అందిస్తామన్నారు. గెలుపొందిన మహిళా జట్లకు కూడా ప్రైజ్‌మనీ ఉంటుందన్నారు. మొత్తం రూ. 5 లక్షలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి వి.వీర్లెంకయ్య, జిల్లా కార్యదర్శి కె.రంగారావు మాట్లాడుతూ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలకు పరిశీలకులను మరికొద్ది రోజుల్లో ఆలిండియా కబడ్డీ అసోసియేష¯ŒS నియమిస్తుందని చెప్పారు. సమావేశంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొత్తపల్లి నాని, కొప్పనీడి శివాజీ, చినిమిల్లి మమ్ము, యాదంరెడ్డి మహేష్ పాల్గొన్నారు.