రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు కారణంగా రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచును దృష్టిలో పెట్టుకుని జనవరి 15 వరకు 78 రైళ్ళను రద్దు చేసేందుకు నిర్ణయించామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
శీల్దా ఎక్స్ ప్రెస్ , నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, బేగంపుర ఎక్స్ ప్రెస్ , లక్నో డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ , గోరఖ్పూర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ , జైపూర్-చండీగఢ్ ఎక్స్ ప్రెస్ , మౌ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి. విజిబిలిటీ తగ్గిన కారణంగా ముందు జాగ్రత్తచర్యగా వీటీని జనవరి 15 వరకు వీటిని రద్దు చేసినట్టు చెప్పారు. వీటిలో ఉత్తర మండలంలో 34 రైళ్లు ఉన్నాయి. చండీగఢ్-అమృతసర్ ఎక్స్ ప్రెస్ రోహ్తక్ ఇంటర్సిటీ, వారణాసి-డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ , లిచ్చావి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయి. ప్రమాదాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఈ సమాచారాన్నిప్రయాణికులకు అందిస్తున్నామని తెలిపారు. సంబంధిత సమాచారాన్ని అందించేందుకు వివిధ స్టేషన్ల దగ్గర హెల్స్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీంతోపాటుగా నెమ్మదిగా వెళ్లాల్సిందిగా మిగిలిన లోకో డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. మరోవైపు వాతావరణం అనుకూలించని కారణంగా ఇవాల్టి రైళ్లు అనేక గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాగా ఉత్తరాదిలో కురుస్తున్న భారీపొగమంచు వాహనాదారులకు తీవ్ర కష్టాలనుతెచ్చిపెడుతోంది. ఇటీవల అనేక రైళ్లు, విమానాల రాకపోకలకు సైతం తరచూ అంతరాయం ఏర్పతోంది. కొన్నిచోట్ల అనేక రోడ్డు ప్రమాదాలుకూడా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.