8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక పాలసీపై సబ్‌కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. విశాఖ కలెక్టరేట్లో సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు.
1.5 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలంలో ఉంచనున్నట్టు, క్యూబిక్ మీటర్ ధరను రూ.500 గా నిర్ణయించామన్నారు. ఈ నెల 8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వేలంతోపాటు, టెండర్లను కూడా ఆహ్వానిస్తామని, ఎక్కువ ధర వేసిన వారికే ఖరారు చేస్తామని యనమల చెప్పారు. చిన్న చిన్న వాగుల నుంచి రైతులు ఎడ్లబండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చునన్నారు. అలాగే, రిటైల్ రంగంపై విధానాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో 10 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్, సన్‌రైజ్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ సదస్సుల్లో 250 ఎంవోయూలు జరగనున్నట్లు యనమల తెలిపారు.