19 మంది మానసిక వికలాంగుల ఊచకోత
జపాన్‌లో ఉన్మాది ఘాతుకం
సగమిహర : జపాన్‌లో ఓ ఉన్మాది మానసిన వికలాంగులపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. తాను గతంలో పని చేసిన మానసిక రోగుల శరణాలయంలోకి చొరబడి 19 మంది మానసిక రోగులపై కత్తులతో దాడి చేసి హతమార్చాడు. మరో 25 మందిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. టోక్యోకు 50 కి.మీ. దూరంలోని సగమిహరలోని సుకూయ్ యామయూరిఎన్ శరణాలయంలో మంగళవారం తెల్లవారజామున ఈ దారుణం జరిగింది.
కత్తులను తెచ్చుకున్న దుండగుడు మూసిఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. రోగులపై కత్తులతో దాడి చేసి పలువురి గొంతులను కోశాడు. తర్వాత పోలీసుల వద్దకెళ్లి లొంగిపోయాడు. నిందితుణ్ని సతోషు ఉమత్సు(26)గా గుర్తించారు. దేశంలోని వికలాంగులందరినీ చంపేయాని అతడు జపాన్ పార్లమెంట్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కోసం తనకు రూ. 33 కోట్లు అందజేస్తే సాధారణ జీవితం గడుపుతానని అతను పేర్కొన్నట్టు తెలిసింది.