'వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లు'
ఢిల్లీ: వచ్చే హర్యానా అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లు ఇస్తామని బీజేపీ నేత అనిల్జైన్ హమీ ఇచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో హర్యానా బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అనిల్జైన్ మీడియాతో మాట్లాడారు. జాట్ల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని అనిల్జైన్ పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.