Jaya B.
-
సూపర్ హిట్ జర్నీ
పాత్రికేయుడిగా, ‘సూపర్‌హిట్’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా బీఏ రాజు జర్నీ సక్సెస్ఫుల్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా విశేషాలను తెలియజేశారు. ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు మరో సినిమా నిర్మించనున్నారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మా బేనర్లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతేడాది నిర్మించిన ‘వైశాఖం’ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టాం. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. -
బి. జయకు సిల్వర్ క్రౌన్!
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినిమాలో ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ప్రముఖ మహిళా దర్శకురాలు జయ బి. గారిని ‘సిల్వర్ క్రౌన్’ పురస్కారంతో సత్కరిస్తున్నామని ‘అక్కినేని–ఫాస్’ ఫిల్మ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డా‘‘ కె. ధర్మారావు తెలిపారు. 2017 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనున్న కార్యక్రమంలో జయ బి.ని సత్కరించనున్నారు. ‘అక్కినేని–ఫాస్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రాలుగా ‘ప్రేమమ్, శతమానం భవతి, ఫిదా, నిన్ను కోరి, వైశాఖం’ (2016 సెప్టెంబర్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకున్నారు)లను ఎంపిక చేశారు. నటుడు సాయికుమార్‌ను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. -
అందుకే ఈ విజయం
– జయ .బి యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీశారని రిలీజ్ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. 8