జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆస్పత్రి చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
జయలలితకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్సను కొనసాగిస్తున్నామని, వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. చికిత్స కోసం జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. జ్వరంతో పాటు డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.