Jaya Nama year
-
గ్రహం అనుగ్రహం, శనివారం 3, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం; తిథి శు.త్రయోదశి ఉ.8.47 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం రోహిణి ఉ.7.25 వరకు తదుపరి మృగశిర వర్జ్యం ప.1.11 నుంచి 2.50 వరకు దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.04 వరకు అమృతఘడియలు రా.11.03 నుంచి 12.43 వరకు సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు భవిష్యం మేషం: దనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు. మిథునం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం. కర్కాటకం: ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కన్య: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు. తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ధనుస్సు: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు. కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. మీనం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 2, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.ద్వాదశి ఉ.9.11 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉ.7.17 వరకు తదుపరి రోహిణి వర్జ్యం రా.11.22 నుంచి 12.58 వరకు దుర్ముహూర్తం ఉ.8.51 నుంచి 9.39 వరకు తదుపరి ప.12.32 నుంచి 1.20 వరకు అమృతఘడియలు ఉ.4.55 నుంచి 6.29 వరకు సూర్యోదయం: 6.35 సూర్యాస్తమయం: 5.34 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: వ్యూహాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో ఒత్తిడులు ఎదుర్కొంటారు. వృషభం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దూరపు బంధువుల కలయిక. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కర్కాటకం: కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. తుల: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. సంఘంలో గౌరవం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం : గురువారం 01, జనవరి 2015
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.ఏకాదశి ఉ.10.05 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం భరణి ఉ.7.37 వరకు తదుపరి కృత్తిక వర్జ్యం రా.7.27 నుంచి 9.02 వరకు దుర్ముహూర్తం ఉ.10.18 నుంచి 11.06 వరకు తదుపరి ప.2.45 నుంచి 3.33 వరకు అమృతఘడియలు ..లేవు సూర్యోదయం : 6.35 సూర్యాస్తమయం : 5.34 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు ముక్కోటి ఏకాదశి భవిష్యం మేషం: పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. బంధువులు, మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృషభం: శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కర్కాటకం: మీ కృషి ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. సింహం: పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. కన్య: ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం. తుల: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృశ్చికం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. ధనుస్సు: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మకరం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. మీనం: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, బుధవారం 31, డిసెంబర్ 2014
శ్రీజయనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.దశమి ప.11.23 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం అశ్వని ఉ.8.19 వరకు తదుపరి భరణి వర్జ్యం సా.5.38 నుంచి 7.11 వరకు దుర్ముహూర్తం ప.11.48 నుంచి 12.38 వరకు అమృతఘడియలు రా.2.57 నుంచి 4.30 వరకు భవిష్యం మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృషభం: మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. మిథునం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. కర్కాటకం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వస్తులాభాలు.వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. బంధువులతో విభేదాలు. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు. కన్య: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. తుల: నూతన పరిచయాలు. సంఘంలో గుర్తింపు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృశ్చికం: మిత్రుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు. మకరం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పనులలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. మీనం:చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు సూర్యోదయం: 6.34 సూర్యాస్తమయం: 5.32 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు